Telugu Global
National

జేపీసీకి జమిలి ఎన్నికల బిల్లు

లోక్‌సభ నిరవధిక వాయిదా

జేపీసీకి జమిలి ఎన్నికల బిల్లు
X

దేశవ్యాప్తంగా లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలను ఏకకాలంలో నిర్వహించడానికి తీసుకొచ్చిన జమిలి ఎన్నికల బిల్లు( 129 రాజ్యాంగ సవరణ బిల్లు ) ను లోక్‌సభ శుక్రవారం జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)కి పంపింది. మంగళవారం దిగువ సభలో కేంద్రం ఈ బిల్లును ప్రవేశపెట్టిన విషయం విదితమే. ఈ బిల్లు భారత రాజ్యాంగ మూల స్వరూపానికి భంగం కలిగించేలా ఉన్నందున జేపీసీకి పంపాలని విపక్షాలు డిమాండ్‌ చేశాయి. అధికారపక్షం మాత్రం ఈ బిల్లు రాజ్యాంగ మూల స్వరూఆపనికి ఏ మాత్రం భిన్నంగా లేదని స్పష్టం చేస్తూనే.. అన్నిపక్షాలూ దీనిపై విస్తృత చర్చ కోరుతున్నందున జేపీసీకి పంపడానికి తమకేకీ అభ్యంతరం లేదని పేర్కొన్నది. ఈ క్రమంలోనే జేపీసీకి పంపింది.

129వ రాజ్యాంగ సవరణ బిల్లుపై అధ్యయనానికి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జేపీసీ కమిటీలో సభ్యుల సంఖ్యను పెంచారు. దీనిలో లోక్‌సభ నుంచి 21, రాజ్యసభ నుంచి 10 మంది ఉంటారని ప్రభుత్వం బుధవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. గురువారం రాత్రి విడుదల చేసిన బులెటిన్‌ లో మాత్రం లోక్‌సభ సభ్యుల సంఖ్యను 27కు, రాజ్యసభ సభ్యుల సంఖ్యను 12కు పెంచుతున్నట్లు పేర్కొన్నది.

లోక్‌సభ నిరవధిక వాయిదా

గత నెల 25న పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. నేడు ఆఖరు తేదీ. ఈ నేపథ్యంలో తదుపరి సెషన్‌ వరకు లోక్‌సభను స్పీకర్‌ నిరవధిక వాయిదా వేశారు. ఈసారి పార్లమెంటు సమావేశాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వ్యాపారవేత్త గౌతమ్‌ అదానీపై అమెరికాలో నమోదైన కేసు, మణిపూర్‌లో మరోసారి చోటుచేసుకుంటున్న హింసాత్మక ఘటనలపై కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలంటూ విపక్షాలు నిరసనలతో లోక్‌సభ సజావుగా సాగలేదు. అలాగే అంబేద్కర్‌పై కేంద్ర హోం మంత్రి చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రూఆపయి. దీనిపై గురువారం పార్లమెంటు ఆవరణలో అధికార, విపక్ష సభ్యుల నిరసనల్లో అసాధారణ ఘటన చోటు చేసుకున్నది. ఎంపీల మధ్య తోపులాట జరిగింది. ఇద్దరు బీజేపీ ఎంపీలు కిందపడటంతో గాయపడ్డారు. రాహుల్‌ గాంధీ నెట్టివేయడంతోనే వాళ్లు గాయపడ్డారని అధికారపార్టీ ఆరోపణలు చేసింది. రాహుల్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఆరోపణలను కాంగ్రెస్‌ తోసిపుచ్చింది.

First Published:  20 Dec 2024 12:57 PM IST
Next Story