2026 నాటికి మావోయిస్టు రహిత దేశంగా భారత్
మావోయిస్టు తీవ్రవాదం తుది దశకు చేరిందన్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా
మావోయిస్టు తీవ్రవాదం తుది దశకు చేరిందని, 2026 నాటికి మావోయిస్టు రహిత దేశంగా మారుతుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. కేంద్ర హోం శాఖ ఆధ్వర్యంలో కేంద్ర హోం మంత్రి నేతృత్వంలో మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంల సమీక్ష జరిగింది. అనంతరం అమిత్ షా మీడియాతో మాట్లాడారు.
ఇప్పటివరకు 13 వేల మందికి పైగా మావోయిస్టులు ఆయుధాలు వదిలిపెట్టారు. 2024లో 202 మంది మావోస్టులు మృతి చెందగా.. 723 మంది లొంగిపోయారు. భవిష్యత్తులో మరింత స్ఫూర్తితో ఒకే లక్ష్యంతో ముందుకెళ్లాలి. ఛత్తీస్‌గఢ్ విజయం అందరికీ ప్రేరణగా నిలుస్తున్నది. అక్కడ కొందరు మావోయిస్టులు లొంగిపోయారు అని షా పేర్కొన్నారు. ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి, హోంమంత్రి, డీజీపీ మొత్తం బృందాన్ని నేను అభినందిస్తున్నాను. జనవరి నుంచి ఇప్పటి వరకు 194 మంది నక్సలైట్లు హతమయ్యారు, 801 మంది నక్సలైట్లు అరెస్టయ్యారు, 742 మంది నక్సలైట్లు లొంగిపోయారని అమిత్ షా తెలిపారు.
హింసాత్మక ఘటనలు 16, 463 నుంచి 7700కి తగ్గాయి. వచ్చే ఏడాది నాటికి ఈ సంఖ్య మరింత తగ్గుతుంది. పదేళ్ల నివేదిక గురించి చెబుతున్నానని.. పౌరులు.. భద్రతా దళాల మరణాలు 70 శాతం తగ్గాయి అన్నారు. హింసను నివేదించిన జిల్లాల సంఖ్య 96 నుంచి 42 కు తగ్గింది. హింసను నివేదించిన పోలీస్ స్టేషన్ల సంఖ్య 465 నుంచి 171 కి తగ్గిందన్నారు. వీటిలో 50 పోలీస్ స్టేషన్లు కొత్తవి అంటే 120 పోలీస్ స్టేషన్లు మాత్రమే హింసను నివేదించాయి అన్నారు.