కిసాన్ క్రెడిట్ కార్డుల రుణ పరిమితి పెంపు..గిగ్ వర్కర్లకు గుడ్‌న్యూస్
కిసాన్ క్రెడిట్ కార్డుల రుణ పరిమితిని రూ. 3 లక్షల నుంచి రూ. 5 లక్షలకు పెంచుతున్నట్లు వెల్లడి
BY Raju Asari1 Feb 2025 11:49 AM IST
X
Raju Asari Updated On: 1 Feb 2025 11:49 AM IST
రైతులకు తక్కువ వడ్డీకే రుణాలిచ్చే కిసాన్ క్రెడిట్ కార్డుల రుణ పరిమితిని రూ. 3 లక్షల నుంచి రూ. 5 లక్షలకు పెంచుతున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. దీంతో 7.7 కోట్ల మంది రైతులకు ప్రయోజనం కలుగుతుందన్నారు. ఎంఎస్‌ఎంఈలక వచ్చే ఐదేళ్లలో రూ. 15 లక్షల కోట్లు కేటాయించనున్నట్లు వివరించారు. ఎంఎస్‌ఎంఈలకు ఇచ్చే రుణాలు రూ. 5 కోట్ల నుంచి రూ.10 కోట్లకు పెంచారు. స్టార్టప్‌లకు రుణాలు రూ. 10 కోట్ల నుంచి రూ. 20 కోట్లకు పెంచారు.
బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి గిగ్ వర్కర్ల గురించి కీలక ప్రకటన చేశారు. వారికి గుర్తింపు కార్డులు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ-శ్రమ్ పోర్టల్ కింద నమోదు చేయనున్నట్లు, పీఎం జన్ ఆరోగ్య యోజన కింద ఆరోగ్య బీమా కల్పించనున్నట్లు వివరించారు. ఈ నిర్ణయంతో కోటి మంది గిగ్ వర్కర్లకు ప్రయోజనం కలగనున్నది.
Next Story