నాలుగోసారి సీఎంగా హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారం
హేమంత్ తో ప్రమాణం చేయించిన గవర్నర్ సంతోష్‌కుమార్ గాంగ్వార్
BY Raju Asari28 Nov 2024 4:30 PM IST

X
Raju Asari Updated On: 28 Nov 2024 4:30 PM IST
ఝార్ఖండ్ రాష్ట్ర 14వ సీఎంగా హేమంత్ సోరెన్ గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ సంతోష్‌కుమార్ గాంగ్వార్ ఆయనతో ప్రమాణం చేయించారు. ఝార్ఖండ్ సీఎంగా హేమంత్ ప్రమాణం చేయడం ఇది నాలుగో సారి ఆ రాష్ట్ర రాజధాని రాంచీలోని మొరహాబాదీ గ్రౌండ్‌లో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభలో విపక్షనేత రాహుల్ గాంధీ, బెంగాల్, తమిళనాడు సీఎంలు మమతా బెనర్జీ, ఎంకే స్టాలిన్, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్, బీహార్‌లో ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్ తదితరులు హాజరయ్యారు. 81 సీట్లున్న ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో జేఎంఎం కూటమి 56 సీట్లతో ఘన విజయం సాధించింది. ఎన్డీఏ కూటమికి 24 సీట్లు మాత్రమే వచ్చాయి.
Next Story