హెలీక్యాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్
చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్, అధికారులు, పైలెట్లు సేఫ్
BY Naveen Kamera16 Oct 2024 2:55 PM IST
X
Naveen Kamera Updated On: 16 Oct 2024 2:55 PM IST
చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ ప్రయాణిస్తున్న హెలీ క్యాప్టర్ పొలాల్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యింది. రాజీవ్ కుమార్ బుధవారం మధ్యాహ్నం ఉత్తరాఖండ్ లోని ఆది కైలాష్ పర్యటనకు హెలీక్యాప్టర్ లో బయల్దేరారు. ప్రతికూల వాతావరణ పరిస్థితులతో పైలెట్ హెలీక్యాప్టర్ ను పితోరాగర్ ఏరియాలోని రాలామ్ అనే గ్రామంలో గల పంట పొలాల్లో దించారు. హెలీక్యాప్టర్ సేఫ్ ల్యాండింగ్ కావడంతో సీఈసీతో పాటు అందులో ప్రయాణిస్తున్న ఇద్దరు అధికారులు, సిబ్బంది సురక్షితంగా బయట పడ్డారు. హెలీక్యాప్టర్ ల్యాండింగ్ గురించి సమాచారం అందుకున్న పితోరాగర్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ సీఈసీకి ఫోన్ చేసి మాట్లాడారు. సీఈసీతో పాటు హెలీక్యాప్టర్ లో ప్రయాణిస్తున్న వారంతా క్షేమంగానే ఉన్నారని, ఎవరికీ ఏమి కాలేదని డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ స్థానిక మీడియాకు వెళ్లడించారు.
Next Story