మహారాష్ట్ర పీసీసీ చీఫ్‌గా హర్షవర్ధన్ సప్కాల్
సీఎల్పీ నేతగా విజయ్ నామ్‌దేవ్‌రావ్ వడెట్టివార్.. నియమించిన కాంగ్రెస్ చీఫ్
BY Naveen Kamera13 Feb 2025 7:14 PM IST
![మహారాష్ట్ర పీసీసీ చీఫ్‌గా హర్షవర్ధన్ సప్కాల్ మహారాష్ట్ర పీసీసీ చీఫ్‌గా హర్షవర్ధన్ సప్కాల్](https://www.teluguglobal.com/h-upload/2025/02/13/1403159-maharashratra-pcc-chief.webp)
X
Naveen Kamera Updated On: 13 Feb 2025 7:14 PM IST
అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత కాంగ్రెస్ పార్టీ మహారాష్ట్రలో సంస్థాగత మార్పులు చేసింది. మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా సీనియర్ నేత హర్షవర్ధన్ వసంతరావ్ సప్కాల్ ను నియమిస్తూ కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. పీసీసీ ప్రస్తుత అధ్యక్షుడు నానా పటోలే సేవలను పార్టీ అభినందిస్తున్నట్టుగా అదే ప్రకటనలో పేర్కొన్నారు. మహారాష్ట్ర సీఎల్పీ నేతగా సీనియర్ ఎమ్మెల్యే విజయ్ నామ్‌దేవ్‌రావ్ వడెట్టివార్ ను నియమించారు. పీసీసీ, సీఎల్పీ నేతల నియామకాలు వెంటనే అమల్లోకి వస్తాయని స్పష్టం చేశారు.
Next Story