Telugu Global
National

సీఈసీగా బాధ్యతలు చేపట్టిన జ్ఞానేశ్‌కుమార్‌

ఓటు వేయడమే జాతి నిర్మాణానికి తొలి అడుగు అని వ్యాఖ్య

సీఈసీగా బాధ్యతలు చేపట్టిన జ్ఞానేశ్‌కుమార్‌
X

కేంద్ర ఎన్నికల సంఘం 26వ సీఈసీగా జ్ఞానేశ్‌కుమార్‌ బాధ్యతలు చేపట్టారు. ఓటు వేయడమే దేశ నిర్మాణానికి తొలి అడుగు అని సీఈసీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అన్నారు. అందువల్ల 18 ఏళ్లు నిండిన ప్రతీ పౌరుడు ఓటరుగా నమోదు చేసుకోవడంతో పాటు ప్రతి ఎన్నికలో ఓటు వేయాలని సూచించారు. రాజ్యాంగంతో పాటు, ఎన్నికల చట్టాలు, నియమ నిబంధనలకు ఓటర్ల పక్షాన ఈసీ పనిచేస్తుందన్నారు. ఎన్నికల సంఘం ఎల్లప్పుడూ ఓటర్లకు మద్దతుగా నిలుస్తుందన్నారు. ఈనెల 17న ప్రధాని మోడీ సారథ్యంలో త్రిసభ్య కమిటీ ద్వారా సీఈసీగా నియమితులైన జ్ఞానేశ్‌కుమార్‌ 2029 జనవరి 26 వరకు ఈ పదవిలో కొనసాగనున్నారు. మరోవైపు ఎన్నికల కమిషనర్‌గా డాక్టర్‌ వివేక్‌ జోషి కూడా బాధ్యతలు చేపట్టారు.హర్యానా క్యాడర్‌కు 1988 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి అయిన వివేక్‌ జోషిని ఎన్నికల కమిషనర్‌గా నియమిస్తూ ఈనెల 17న న్యాయమంత్రిత్వ శాఖ గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

First Published:  19 Feb 2025 12:26 PM IST
Next Story