Telugu Global
National

రామయ్య భక్తులకు చుక్కలు చూపించిన గూగుల్‌ మ్యాప్‌

ఇరుకు సందులోకి తీసుకెళ్లిన మ్యాప్‌.. తంటాలు పడ్డ భక్తులు

రామయ్య భక్తులకు చుక్కలు చూపించిన గూగుల్‌ మ్యాప్‌
X

భద్రాద్రి రామయ్య దర్శనానికి వెళ్తోన్న భక్తులకు గూగుల్‌ మ్యాప్‌ చుక్కలు చూపించింది. గూగుల్‌ మ్యాప్‌ చూపించిన దారిలో బస్సును ముందుకు నడిపించిన డ్రైవర్‌ ఒక్కసారిగా నోరెళ్లబెట్టాడు. అది ఇరుకు సందు కావడంతో ముందుకెళ్లలేక.. వెనక్కి రాలేక నానా తంటాలు పడ్డాడు. అందులో ఉన్న భక్తులు సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో గూగుల్‌ మ్యాప్‌ ను నమ్మి గుడ్డిగా ముందుకెళ్లడం ఏమాత్రం శ్రేయస్కరం కాదని.. క్షేమం అంతకన్నా కాదని మరోసారి రుజువయ్యింది. విజయనగరం జిల్లాకు చెందిన భక్తులు ప్రైవేట్‌ టూరిస్టు బస్సులో భద్రాచలం చేరుకున్నారు. రామయ్య దర్శనం కోసం రామాలయానికి వెళ్లేందుకు గూగుల్‌ మ్యాప్‌ పెట్టుకున్నారు. మ్యాప్‌ చూపించిన మార్గంలోనే డ్రైవర్‌ బస్సును నడిపించాడు.. అది కాస్త రాంగ్‌ రూట్‌.. బస్సు అలా ముందకెళ్లి రాజవీది జంక్షన్‌ లో ఇరుక్కుపోయింది. కొన్ని గంటలు శ్రమించినా బస్సు ముందుకు కదలలేదు. చివరికి స్థానికులు తలా ఒక చెయ్యి వేసి ముందు రోడ్డు వైపు ఎవరూ రాకుండా జాగ్రత్తలు తీసుకొని బస్సును మెయిన్‌ రోడ్డుకు తీసుకువచ్చారు. దీంతో బతుకు జీవుడా అంటూ భక్తులు బస్సు ఎక్కి రాములోరి ఆలయం వైపునకు సాగారు.

First Published:  26 Dec 2024 8:45 PM IST
Next Story