Telugu Global
National

తిరుమల లడ్డూ కౌంటర్‌ లో అగ్నిప్రమాదం

షార్ట్‌ సర్క్యూట్‌తో చెలరేగిన మంటలు

తిరుమల లడ్డూ కౌంటర్‌ లో అగ్నిప్రమాదం
X

తిరుపతిలో తొక్కిసలాట ఘటన మరువకముందే కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి చెంత మరో అపశృతి చోటు చేసుకుంది. తిరుమలలోని లడ్డూ కౌంటర్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. భక్తులకు లడ్డూలు పంపిణీ చేస్తున్న సమయంలో 47వ నంబర్‌ కౌంటర్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. లడ్డూ కౌంటర్‌ సిబ్బందితో పాటు అక్కడే భక్తులు ఏం జరుగుతుందో తెలియక అయోమయానికి గురయ్యారు. సిబ్బంది వెంటనే మంటలు ఆర్పివేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. షార్ట్‌ సర్క్యూట్‌తోనే మంటలు చెలరేగాయని చెప్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

తిరుపతిలో తొక్కిసలాట దురదృష్టకరం : టీటీడీ చైర్మన్‌

వైకుంఠ ఏకాదశి దర్శనం టికెట్ల కోసం వచ్చిన భక్తులు తొక్కిసలాటలో మృతిచెందడం.. టికెట్ల కోసం తొక్కిసలాట జరగడం దురదృష్టకరమని టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడు తెలిపారు. సోమవారం తిరుమలలో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. తొక్కిసలాటలో గాయపడిన 31 మందికి పరిహారం చెక్కులు అందజేశమాన్నారు. ఇంకో 28 మందికి మంగళవారం లోగా చెక్కులు అందజేస్తామన్నారు. తనను ఉద్దేశించి కొందరు సోషల్‌ మీడియాలో ఇష్టం వచ్చినట్టుగా ప్రచారం చేస్తున్నారని.. వాటిని నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు.

First Published:  13 Jan 2025 12:55 PM IST
Next Story