Telugu Global
National

హెజ్‌బొల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ భీకర దాడులు

మధ్యప్రాచ్యంలో ఉద్రికత్త పరిస్థితులు..ఇప్పటివరకు 492 మంది మృతి .. 1600 మందికి పైగా గాయాలు

హెజ్‌బొల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ భీకర దాడులు
X

మధ్యప్రాచ్యంలో ఉద్రికత్త పరిస్థితులు నెలకొన్నాయి. హెజ్‌బొల్లా స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్‌ చేస్తున్న దాడులతో లెబనాన్‌లో మృతుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. హెజ్‌బొల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ భీకర దాడులు కొనసాగిస్తున్నది. ఇజ్రాయెల్‌ వైమానిక దాడుల్లో మృతుల సంఖ్య భారీగా పెరుగుతున్నది. ఇప్పటివరకు 492 మంది మృతి చెందగా.. 1600 మందికి పైగా గాయపడ్డారు. మృతుల్లో 24 మంది చిన్నారులు సహా మహిళలు, పారామెడికల్‌ సిబ్బంది ఉన్నారు. లెబనాన్‌పై 2006 తర్వాత మొదటిసారి అత్యంత ఘోరమైన దాడిగా దీన్ని పేర్కొంటున్నారు.

హెజ్‌బొల్లాకు మీరు మానవ కవచాలుగా మారొద్దు: నెతన్యాహు

తాజా దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు స్పందించారు. హెజ్‌బొల్లాకు మీరు మానవ కవచాలుగా మారొద్దని సూచించారు. తమ యుద్ధం పౌరుల ఇళ్లలో మిసైల్స్‌ దాచిన హెజ్‌బొల్లాతోనే అని మీడియా సందేశంలో వెల్లడించారు. ఇజ్రాయెల్‌ను లక్ష్యంగా చేసుకున్నందుకే ఇళ్లలో మిసైల్స్‌, రాకెట్లు దాచారిన నెతన్యాహూ మండిపడ్డారు.

అలీ కరాకీ కోసం ఇజ్రాయెల్‌ వేట

హెజ్‌బొల్లా కమాండర్‌ అలీ కరాకీ కోసం ఇజ్రాయెల్‌ వేట కొనసాగిస్తున్నది. హెజ్‌బొల్లా నస్రుల్లాకు మిగిలిన సన్నితుల్లో కరాకీ ఒకరు. అతను ప్రస్తుతం సురక్షితంగా ఉన్నట్లు హెజ్‌బొల్లా ప్రకటించింది. మరోవైపు లెబనాన్‌లోని ఇళ్లలో క్షిపణులు ఉన్నట్లు ఇజ్రాయెల్‌ గుర్తించింది. ఈ మేరకు వాటికి సంబంధించిన ఫొటోలను ఐడీఎఫ్‌ విడుదల చేసింది.

లెబనాన్‌ భద్రతకు చైనా మద్దతు

మరోవైపు లెబనాన్‌ భద్రతకు చైనా మద్దతు ప్రకటించింది. ఈ మేరకు చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌యూ లెబనాన్‌ విదేశాంగ శాఖ మంత్రి అబ్దుల్లా బౌ హబీబ్‌తో మాట్లాడారు. లెబనాన్‌ సార్వభౌమాధికారం, భద్రతను పరిరక్షించుకోవడానికి చైనా దృఢంగా మద్దతు ఇస్తుందని భరోసా కల్పించారు. ఇజ్రాయెల్‌ వైమానిక దాడి ఉల్లంఘనలను చైనా తీవ్రంగా ఖండించింది. మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రికత్తల గురించి న్యూయార్క్‌లో వాంగ్‌ యూ, హబీబ్‌ చర్చించారు.

First Published:  24 Sept 2024 9:15 AM IST
Next Story