ఢిల్లీ సీఎం ఎన్నికపై కసరత్తు
సాయంత్రం 6.15 గంటలకు శాసనసభా పక్ష సమావేశం

హస్తినలో 27 ఏళ్ల తర్వాత ఘన విజయం సాధించి బీజేపీ అధికారాన్ని కైవసం చేసుకున్నది. ఈ నేపథ్యంలో కొత్త ప్రభుత్వం కొలువుతీరడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. రేపు సాయంత్రం 4.30 గంటలకు కొత్త సీఎం ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారైనట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఢిల్లీలోని రాంలీలా మైదానంలో జరిగే ఈ వేడుకకు కమలదళం భారీ ఏర్పాట్లు చేస్తున్నది. బీజేపీ సీనియర్ నాయకులు రాంలీలా మైదానాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ కార్యక్రమానికి కాషాయ పార్టీ అగ్రనేతలతో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు హాజరయ్యే అవకాశం ఉన్నది.
ఇవాళ సాయంత్రం 6.15 గంటలకు బీజేపీ శాసనసభ పక్ష సమావేశం జరగనున్నది. అందులో కొత్త సీఎంతో పాటు మంత్రివర్గ కూర్పుపై ఓ స్పష్టత రానున్నది. మరోవైపు మధ్యాహ్నం ప్రధాని మోడీ అధ్యక్షతన బీజేపీ కేంద్ర కార్యాలయంలో సమావేశం జరగనున్నది. అనంతరం ముఖ్యమంత్రి ఎవరు అన్న సస్పెన్షన్‌కు బీజేపీ తెరదించనున్నది.