Telugu Global
National

జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌.. ఉగ్రవాది హతం

శ్రీనగర్‌లోని హర్వాన్‌ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్న భారత ఆర్మీ, జమ్మూకశ్మీర్‌ పోలీసులు

జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌.. ఉగ్రవాది హతం
X

జమ్మూకశ్మీర్‌ లోని శ్రీనగర్‌ దచిగామ్‌ అడవుల్లో సైన్యానికి ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఒక ఉగ్రవాది ని భద్రతా దళాలు మట్టుబెట్టాయి. అడవుల్లో దాక్కున్న ఉగ్రవాదుల కోసం వేట కొనసాగుతున్నది. దచిగామ్‌ అడవుల్లో ముష్కరులు నక్కి ఉన్నట్లు పక్కా నిఘా సమాచారంతో పోలీసులు, సైన్యం అక్కడ కార్డెన్‌ సెర్చ్‌ ఆపరేషన్‌ నిర్వహించాయి. ఈ క్రమంలో ఉగ్రవాదులు భద్రతా బలగాలపైకి ఒక్కసారిగా కాల్పులు జరిపారు. ఎదురుకాల్పుల్లో ఉగ్రవాది హతమయ్యాడు.

First Published:  3 Dec 2024 11:20 AM IST
Next Story