Telugu Global
National

ఎన్‌సీసీతో క్రమశిక్షణ, సేవ, నాయకత్వ లక్షణాలు

స్వామి వివేకానంద 162 వ జయంతి సందర్భంగా జనవరి 11, 12 తేదీల్లో భారత మండపంలో వికసిత్‌ భారత్‌, యంగ్‌ లీడర్స్‌ డైలాగ్‌ను నిర్వహించనున్నట్లు ప్రధాని ప్రకటన

ఎన్‌సీసీతో క్రమశిక్షణ, సేవ, నాయకత్వ లక్షణాలు
X

రాజకీయ నేపథ్యంలోని కుటుంబాల నుంచి పాలిటిక్స్‌లోకి రావాలని ప్రధాని నరేంద్రమోడీ పిలుపునిచ్చారు. మన్‌ కీ బాత్‌ 116 ఎపిసోడ్‌లో కార్యక్రమంలో తన మనసులోని మాటలను పంచుకున్న ప్రధాని మోడీ వికసిత్‌ భారత్‌ సంకల్పంలో యువత పాత్ర ప్రధానమైందని గుర్తు చేశారు. స్వామి వివేకానంద 162 వ జయంతి సందర్భంగా జనవరి 11, 12 తేదీల్లో భారత మండపంలో వికసిత్‌ భారత్‌, యంగ్‌ లీడర్స్‌ డైలాగ్‌ను నిర్వహించనున్నట్లు ప్రధాని ప్రకటించారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ.. ఇవాళ ఎన్‌సీసీ దినోత్సవం. ఇది చాలా ప్రత్యేకమైన రోజు. ఎన్‌సీసీ వల్ల క్రమశిక్షణ, సేవ, నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి. ఎక్కడ ప్రకృతి విపత్తులు సంభవించినా.. అక్కడ ఎన్‌సీసీ సేవలు ఉంటాయి. దేశంలో ఎన్‌సీసీ వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తున్నాం. 2024లో సుమారు 20 లక్షల మంది ఎన్‌సీసీలో చేరారు. ఎన్‌సీసీలో 5 వేల విద్యాసంస్థలు భాగమయ్యాయి. యువత పెద్ద సంఖ్యలో ఎన్‌సీసీలో చేరాలి. వికసిత్‌ భారత్‌లో యువకుల పాత్ర ప్రధానమైంది. ఏటా జనవరి 12న జాతీయ యువ దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈసారి భారత్‌ మండపంలో జాతీయ యువ దినోత్సవం జరుపుకోబోతున్నాం. 'యంగ్‌ లీడర్స్‌ డైలాల్‌' పేరిట ఈసారి యువ దినోత్సవం జరుపుకోబోతున్నామన్నారు.

జీవ వైవిధ్యాన్ని కాపాడటంలో పిచ్చుకల పాత్రను మోడీ వివరించారు. పట్టణీకరణ కారణంగా నేటి తరం పిల్లలు పిచ్చుకలను టీవీల్లో మాత్రమే చూస్తున్నారన్నారు. వాటి సంఖ్యను పెంచడానికి చెన్నై కుడుగల్‌ ట్రస్ట్‌ తీసుకుంటున్న చొరవను వివరించారు. డిజిటల్‌ అరెస్టులు, సైబర్‌ నేరాల వంటి వాటి గురించి వృద్ధులకు అవగాహన కల్పిస్తున్న యువకుడిని మోడీ అభినందించారు.

గయానాలో తన పర్యటన గురించి మోడీ ప్రస్తావించారు. భారత్‌కు వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న గయానాలో ఒక మినీ భారత్‌ ఉన్నది. కూలీ పనుల కోసం 180 ఏళ్ల కిందట ఎంతోమంది భారతీయులను అక్కడికి తీసుకెళ్లారు. అయితే నేడు విద్య, రాజకీయాలు, సంస్కృతి, వ్యాపారం ఇలా ఎన్నోరంగాల్లో భారత మూలాలున్న వ్యక్తులు తమదైన ముద్ర వేస్తున్నారు. ఆయా రంగాల్లో నాయకత్వం వహిస్తున్నారు. గయానా అధ్యక్షుడు మహమ్మద్‌ ఇర్ఫాన్‌ అలీ కూడా భారత సంతతి వ్యక్తే. దేశ వారసత్వం పట్ల గర్వపడేలా చేస్తున్నారని కొనియాడారు.

First Published:  24 Nov 2024 12:52 PM IST
Next Story