Telugu Global
National

ఫిబ్రవరి 19న ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారం!

సోమ, మంగళవారాల్లో బీజేపీ శాసనసభా పక్ష నేతలు సమావేశం కానున్నట్లు సమాచారం

ఫిబ్రవరి 19న ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారం!
X

దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఫలితాలు వెలువడి రోజులు గడుస్తున్నా సీఎం ఎవరనేదానిపై సస్పెన్స్‌ కొనసాగుతున్నది. ఈ క్రమంలోనే సీఎం ప్రమాణ స్వీకారం ఫిబ్రవరి 19,20 తేదీల్లో ఉండనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

అమెరికా, ఫ్రాన్స్‌ పర్యటన ముగించుకుని ప్రధాని భారత్‌కు బయలుదేరిన విషయం విదితమే. ఈ క్రమంలోనే సోమ, మంగళవారాల్లో బీజేపీ శాసనసభా పక్ష నేతలు సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. ఈ భేటీకి ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా పలువురు కీలక నేతలు హాజరుకానున్నారు. అనంతరం సీఎం ఎవరు అనేదానిపై స్పష్టత రానున్నది. ఎన్నికల్లో గెలిచిన 48 మంది అభ్యర్థుల్లో 15 మంది పార్టీ షార్ట్‌ లిస్ట్‌ చేసింది. వీరిలో తొమ్మిది మంది సీఎం, స్పీకర్‌, క్యాబినెట్‌ స్థానాలకు ఎంపిక చేయనున్నది.

సీఎం అభ్యర్థి రేసులో మాజీ సీఎం కేజ్రీవాల్‌ను ఓడించిన పర్వేశ్‌ వర్మ ముందంజలో ఉన్నారు. ఆయనతో పాటు సతీశ్‌ ఉపాధ్యాయ్‌, విజయేందర్‌ గుప్తా, ఆశిష్‌ సూద్‌, పవన్‌ శర్మ వంటి పలువురు నేతల పేర్లు ప్రచారంలో ఉన్నాయి. పూర్వాంచల్‌ నేపథ్యం కలిగిన ఎమ్మెల్యే, సిక్కు లేదా మహిళను కూడా పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉన్నదని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

First Published:  14 Feb 2025 2:11 PM IST
Next Story