ఢిల్లీ ఎగ్జిట్ పోల్స్‌లో బీజేపీకే ఎడ్జ్!
మ్యాజిక్ ఫిగర్ చేరుకుంటుందని పలు సర్వే సంస్థల అంచనా
![ఢిల్లీ ఎగ్జిట్ పోల్స్‌లో బీజేపీకే ఎడ్జ్! ఢిల్లీ ఎగ్జిట్ పోల్స్‌లో బీజేపీకే ఎడ్జ్!](https://www.teluguglobal.com/h-upload/2025/02/05/1400653-delhi-exit-polls.webp)
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. సాయంత్రం వరకు 60 శాతం మంది ప్రజలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. సాయంత్రం 6 గంటల వరకు క్యూలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం ఉండటంతో ఓటింగ్ శాతం ఇంకా పెరుగనుంది. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు పలు సర్వే సంస్థలు సాయంత్రం 6.30 గంటల తర్వాత తమ ఎగ్జిట్ పోల్ ఫలితాలను ప్రకటించాయి. మెజార్టీ సర్వే సంస్థలు బీజేపీకే ఎడ్జ్ ఉంటుందని, మ్యాజిక్ ఫిగర్ ను కమలం పార్టీ దాటేస్తుందని అంచనా వేశాయి. తెలుగు రాష్ట్రాల్లో పాపులర్ అయిన కేకే సర్వే మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీ మూడోసారి గెలిచి హ్యాట్రిక్ నమోదు చేస్తుందని అంచనా వేసింది. కొన్ని సర్వే సంస్థల ఎగ్జిట్ పోల్స్‌లో బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీలు హోరాహోరీగా తలపడ్డాయని.. ఫలితం బీజేపీకే అనుకూలంగా ఉంటుందని అంచనా వేశాయి. ఏ ఒక్క సర్వే కూడా కాంగ్రెస్ పార్టీకి ఒక సీటు ఖచ్చితంగా వస్తుందని అంచనా వేయలేదు. 2015, 2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ 67, 63 స్థానాలతో ఏకపక్ష విజయం సొంతం చేసుకుంది. పదేళ్ల పాటు అధికారంలో ఉండటంతో ప్రజల్లో వ్యతిరేకత, కేంద్ర బడ్జెట్‌లో రూ.12 లక్షల వరకు ఇన్‌కమ్ ట్యాక్స్ మినహాయింపు, బీజేపీ ప్రకటించిన సంక్షేమ పథకాలతో ఆ పార్టీ వైపు ప్రజలు కొంత మొగ్గు చూపారని సర్వే ఏజెన్సీలు చెప్తున్నాయి. ప్రజలు ఇచ్చిన అసలైన తీర్పు ఈనెల 8న ఓట్లు లెక్కించిన తర్వాత వెల్లడికానుంది.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలపై వివిధ సంస్థల ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఇలా ఉన్నాయి..
పీపుల్స్ పల్స్
బీజేపీ 51 - 60
ఆప్ 10 -19
కాంగ్రెస్ 0
ఏబీపీ మ్యాజిక్
బీజేపీ 35-40
ఆప్ 32 -37
చాణక్య స్ట్రాటజీస్
బీజేపీ 39 -44
ఆప్ 25 -28
కేకే సర్వే
బీజేపీ 22
ఆప్ 39
టైమ్స్ నౌ
బీజేపీ 39 -45
ఆప్ 22 -31
కాంగ్రెస్ 0 -2
రిపబ్లిక్ పీ మార్క్
బీజేపీ 39 -49
ఆప్ 21 - 31
కాంగ్రెస్ 0-1
పీపుల్స్ ఇన్‌సైట్
బీజేపీ 40 -44
ఆప్ 25 -29
కాంగ్రెస్ 0 -2
మ్యాట్రిజ్
బీజేపీ 35 - 40
ఆప్ 32 -37
కాంగ్రెస్ 0 -1