Telugu Global
National

ఢిల్లీలో తీవ్రస్థాయిలో కాలుష్యం.. నేటి నుంచి కఠిన నిబంధనలు

ఈ ఉదయం 8 గంటల నుంచి గ్రేడెడ్‌ రెస్పాన్స్‌ యాక్షన్‌ ప్లాన్‌ అమల్లోకి

ఢిల్లీలో తీవ్రస్థాయిలో కాలుష్యం.. నేటి నుంచి కఠిన నిబంధనలు
X

దేశ రాజధాని ఢిల్లీని కాలుష్య పొగ మంచు అలుముకున్నది వరుసగా రెండో రోజు వాయు నాణ్యత సూచీ (ఏక్యూఐ) తీవ్రస్థాయికి చేరింది. గురువారం ఉదయం 428 గా నమోదైంది. దీంతో కట్టడి చర్యల్లో భాగంగానేటి నుంచి కఠిన నిబంధనలు అమలుచేయనున్నది. ఈ ఉదయం 8 గంటల నుంచి గ్రేడెడ్‌ రెస్పాన్స్‌ యాక్షన్‌ ప్లాన్‌, (జీఆర్‌ఏపీ)ని అమల్లోకి తేనున్నది. పొగ మంచు కారణంగా గురువారం పలుచోట్ల రోడ్డు ప్రమాదాలు జరగడం సహా వందలాది విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో జీఆర్‌ఏపీ నిబంధనల ప్రకారం బీఎస్‌-3 కి చెందిన పెట్రోల్‌ వాహనలు, బీఎస్‌-4 కేటగిరికి చెందిన డీజిల్‌ వాహనాలు ఢిల్లీలోని కాలుష్య ప్రభావిత ప్రాంతాల్లోకి అనుమతించరు. జాతీయ భద్రత, మౌలిక సదుపాయాలు, ఆరోగ్య కేంద్రాల నిర్మాణాలు మినహా మిగిలిన నిర్మాణాలు, కూల్చివేతలపై నిషేధం అమల్లోకి తెచ్చారు. 5 తరగతి విద్యార్థులకు నేటి నుంచి వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపునిచ్చారు. ఆన్‌లైన్‌ ద్వారా వారికి క్లాస్‌లు నిర్వహించనున్నారు.

First Published:  15 Nov 2024 3:08 AM GMT
Next Story