Telugu Global
National

రేపటి నుంచి బెలగావిలో సీడబ్ల్యూసీ సమావేశాలు

నవ సత్యాగ్రహ భైఠక్‌ లో పాల్గొననున్న కాంగ్రెస్‌ ప్రముఖులు

రేపటి నుంచి బెలగావిలో సీడబ్ల్యూసీ సమావేశాలు
X

కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (సీడబ్ల్యూసీ) ప్రత్యేక సమావేశాలకు సర్వం సిద్ధమైంది. మహాత్మా గాంధీ ఏఐసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించి వందేళ్లు పూర్తవుతున్న సందర్భాన్ని పురష్కరించుకొని కాంగ్రెస్‌ పార్టీ కర్నాటకలోని బెలగావిలో ఈ ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తోంది. గురు, శుక్రవారాల్లో నిర్వహించే వర్కింగ్‌ కమిటీ సమావేశాలకు నవ సత్యాగ్రహ భైఠక్‌ లో బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగంపై, ప్రజాస్వామ్యంపై కొనసాగిస్తున్న దాడి.. మహాత్మాగాంధీ స్ఫూర్తితో సాగించాల్సిన పోరాటాలు, ఇటీవల జరిగిన హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓటమి సహా పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. సమావేశంలో సీడబ్ల్యూసీ సభ్యులు, శాశ్వత ఆహ్వానితులు, ప్రత్యేక ఆహ్వానితులు, పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలు, పార్లమెంటరీ పార్టీ ఆఫీస్‌ బేరర్లు, సీఎంలు, మాజీ సీఎంలు దాదాపు 200 మంది కీలక నేతలు పాల్గొంటారు. తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌ నుంచి హెలీక్యాప్టర్‌ లో బయల్దేరి బెలగావికి వెళ్తారు.

First Published:  25 Dec 2024 10:02 PM IST
Next Story