ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం
పోస్టల్ ఓట్ల లెక్కింపులో ఆప్ 17, బీజేపీ 15, కాంగ్రెస్ 2 చోట్ల ఆధిక్యం
BY Raju Asari8 Feb 2025 8:40 AM IST
![ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం](https://www.teluguglobal.com/h-upload/2025/02/08/1401446-delhi.webp)
X
Raju Asari Updated On: 8 Feb 2025 8:40 AM IST
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. దీనికోసం ఈసీ పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసింది. 19 కౌంటింగ్ కేంద్రాల వల్ల 10 వేల మంది పోలీసులు మోహరించారు. మొత్తం 70 సీట్లలో 699 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు అధికారం దక్కించుకోవాలంటే కనీసం 36 సీట్లలో విజమం సాధించాల్సి ఉంటుంది. ఈ నెల 5న జరిగిన ఢిల్లీ పోలింగ్‌లో 60.54 శాతం పోలింగ్ నమోదైంది. ప్రధానంగా ఆప్, బీజేపీ మధ్య ముఖాముఖి పోరు నెలకొన్నది. ఆ రెండు పార్టీలూ విజయంపై వేటికవే ధీమాగా ఉన్నాయి.ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నది. తొలుత పోస్టల్ ఓట్లను లెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఆప్ 17, బీజేపీ 15, కాంగ్రెస్ 2 చోట్ల ఆధిక్యంలో ఉన్నాయి
Next Story