Telugu Global
National

సమాజానికి రాజ్యాంగం మూలస్తంభం

'రాజ్యాంగం' తొలి సంస్కృత కాపీని విడుదల చేసిన రాష్ట్రపతి

సమాజానికి రాజ్యాంగం మూలస్తంభం
X

మన రాజ్యాంగం ఆమోదం పొంది 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నేడు పాత పార్లమెంటు ప్రాంగణంలోని సెంట్రల్‌ హాల్లో ప్రత్యేక వేడుకలు నిర్వహించారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉప రాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, ప్రధాని మోడీ సహా కేంద్ర మంత్రులతో పాటు లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ద్రౌపదీ ముర్ము మాట్లాడుతూ..దేశ ప్రజలందరికీ రాజ్యాంగ వజ్రోత్సవాల శుభాకాంక్షలు . రాజ్యాంగం భారతదేశ పవిత్ర గంథ్రమని,ఈ చరిత్రాత్మక ఘటనలో దేశ పౌరులు భాగస్వామ్యం అవుతున్నారని అన్నారు. 75 ఏళ్ల కిందట ఇదే రోజున రాజ్యాంగం ఆమోదం పొందింది. రాజ్యాంగ రచనలో భాగస్వాములైన 15 మంది మహిళలను రాష్ట్రపతి స్మరించుకున్నారు. మహిళలకు రిజర్వేషన్ల ద్వారా ప్రజాస్వామ్యంలో మహిళలకు సాధికారత లభించిందన్నారు.ప్రజాస్వామ్య, గణతంత్ర ఆధారంగా రాజ్యాంగ రూపకల్పన జరిగిందన్నారు. రాజ్యాంగానికి రాజేంద్రప్రసాద్‌, అంబేద్కర్‌ మార్గనిర్దేశం చేశారు. ప్రగతిశీల సూత్రాల గురించి రాజ్యాంగంలో పొందుపరిచారని పేర్కొన్నారు. రాజ్యాంగం సమాజానికి మూలస్తంభం వంటిదన్నారు. రాజ్యాంగ రచనలో భాగస్వాములను ఈ సందర్బంగా స్మరించుకోవాలని ముర్ము గుర్తుచేశారు.

రాజ్యాంగ నిర్మాణంలో బీ.ఎన్‌.రావు కీలక భూమిక పోషించారని తెలిపారు. 75 ఏళ్ల స్వాతంత్ర భారతంలో అమృత్‌ మహోత్సవాలు నిర్వహించుకున్నామన్నారు. పంచశీల సూత్రాల గురించి రాజ్యాంగంలో పొందుపరిచారు. దేశ లక్ష్యాల సాధనలో అందరం ఐక్యంగా ఉన్నామనే భావన చాటాలి. దేశ ప్రజల ఆకాంక్షల సాధనకు స్వాతంత్య్ర సమరయోధులు కృషి చేశారని గుర్తు చేశారు. పార్లమెంటులో అన్ని రాష్ట్రాల ప్రతినిధుల భాగస్వామ్యం ఉందన్నారు. రాజ్యాంగ నిర్మాతలు, చరిత్రపై పుస్తకాల ఆవిష్కరణ జరిగిందన్నారు. రాజ్యాంగం అనేది సజీవ ప్రగతిశీల పత్రం అన్నారు. రాజ్యాంగం ద్వారా సామాజిక న్యాయం, సమ్మిళిత వృద్ధి సాధించామన్నారు. అన్నివర్గాల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందన్నారు. బలహీనవర్గాల కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టిందన్న రాష్ట్రపతి పేదలకు సొంత ఇళ్లు సమకూరుతున్నాయన్నారు. రాజ్యాంగ వజ్రోత్సవాల సందర్భంగా ప్రత్యేక స్టాంపు, నాణెం ను రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధాని, స్పీకర్‌ ఆవిష్కరించారు. రాజ్యాంగానికి సంబంధించి రెండు పుస్తకాలను ఈ సందర్బంగా రాష్ట్రపతి ఆవిష్కరించారు.

First Published:  26 Nov 2024 12:40 PM IST
Next Story