నాందేడ్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ దే గెలుపు
ఆఖరి రౌండ్ లో విజయం సాధించిన చవాన్ రవీంద్ర వసంత్‌రావ్
నాందేడ్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీనే విజయం వరించింది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన మహాయుతి లోక్‌సభ ఉప ఎన్నికను స్వల్ప ఓట్ల తేడాతో చేజార్చుకుంది. ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి మారోత్‌రావ్ హంబార్డే మొదటి నుంచి ఆదిపత్యం ప్రదర్శిస్తూ వచ్చాడు. లీడ్ స్వల్పంగానే ఉండటంతో చివరి రౌండ్ లో ఫలితం తారుమారు అయ్యింది. కాంగ్రెస్ అభ్యర్థి చవాన్ రవీంద్ర వసంత్‌రావ్ కు 5,86,788 ఓట్లు పోల్ కాగా, బీజేపీ అభ్యర్థి మారోత్‌రావ్ హంబార్డేకు 5,85,331 ఓట్లు వచ్చాయి. 1,457 ఓట్ల ఆదిక్యంతో కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించారు. ఈ లోక్‌సభ స్థానం పరిధిలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మహాయుతి కూటమి అభ్యర్థులే విజయం సాధించగా, ఒకే ఒక్క స్థానంలో కాంగ్రెస్ క్యాండిడేట్ గెలిచారు. కేరళలోని వయనాడ్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ప్రియాంకగాంధీ సీపీఐ అభ్యర్థి సత్యన్ మోకేరిపై 4,10,931 ఓట్ల భారీ ఆదిక్యంతో విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్ కు 1,09,939 ఓట్లు పోలయ్యాయి. ఉప ఎన్నికలు జరిగిన రెండు లోక్‌సభ స్థానాలను కాంగ్రెస్ పార్టీనే గెలుచుకుంది.