Telugu Global
National

మోడీ, షాలపై ఈసీకి కాంగ్రెస్‌ ఫిర్యాదు

ఓట్ల కోసం కుల, మత ప్రాతిపదికన ఓటర్లను రెచ్చగొట్టడం, విభజించడం చేశారని ఈసీకి వివరించిన కాంగ్రెస్‌

మోడీ, షాలపై ఈసీకి కాంగ్రెస్‌ ఫిర్యాదు
X

మహారాష్ట్ర, ఝార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా పలు తప్పుడు, దురుద్దేశ ప్రకటనలు చేశారని కేంద్ర ఎన్నికల సంఘానికి కాంగ్రెస్‌ ఫిర్యాదు చేసింది. రాబోయే ఎన్నికల్లో మోడీ, షాలు ఎలాంటి ప్రచారాలు నిర్వహించకుండా నిషేధించాలని కోరింది. ఈ ఘటనలో బాధ్యులపై క్రిమినల్‌ కేసులు పెట్టాలని ఈసీని కాంగ్రెస్‌ కోరింది. నవంబర్‌ 8న నాసిక్‌లో మోడీ చేసిన ప్రచారంలో ఎస్సీ,, ఎస్టీ, బీసీలకు కాంగ్రెస్‌ వ్యతిరేకమని నిరాధార తప్పుడు వ్యాఖ్యలు చేశారని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరామ్‌ రమేశ్‌ ఆరోపించారు. నవంబర్‌ 12 ఝార్ఖండ్‌ ధన్‌బాద్‌లో ప్రచారం నిర్వహించిన అమిత్‌ షా కాంగ్రెస్‌ పార్టీ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నదని వ్యాఖ్యానించారని జైరామ్‌ రమేశ్‌ ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లు తీసేసి వాటిని ఒక మతానికి ఇవ్వాలనుకుంటున్నదని కాంగ్రెస్‌ అనుకుంటున్నదని షా చెప్పారని తెలిపారు. ఇవన్నీ ఓట్ల కోసం కుల, మత ప్రాతిపదికన ఓటర్లను రెచ్చగొట్టడం, విభజించడం చేశారని ఈసీకి వివరించారు. మోడీ-షా ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారని క్రిమినల్‌ చట్టం ప్రకారం వారు చేసింది నేరాలు అని జైరామ్‌ ఈసీకి సమర్పించిన మెమోరాండంలో వెల్లడించారు.

First Published:  15 Nov 2024 3:21 AM GMT
Next Story