అజ్మీర్ దర్గాకు సీఎం రేవంత్ రెడ్డి చాదర్
ప్రత్యేక ప్రార్థనలు చేసిన సీఎం, మంత్రులు
BY Naveen Kamera4 Jan 2025 6:04 PM IST
X
Naveen Kamera Updated On: 4 Jan 2025 6:04 PM IST
అజ్మీర్ దర్గాకు తెలంగాణ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి చాదర్ సమర్పించారు. శనివారం సెక్రటేరియట్ లో మంత్రులు శ్రీధర్ బాబు, కొండా సురేఖ, ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ జి. చెన్నారెడ్డితో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం తరపున పదేళ్లుగా చాదర్ సమర్పిస్తున్నారు. అదే సంప్రయదాన్ని రేవంత్ రెడ్డి కొనసాగించారు. కార్యక్రమంలో వక్ఫ్ బోర్డు చైర్మన్ అజ్మతుల్లా, ముస్లిం మత పెద్దలు, మైనార్టీ సెల్ నాయకులు పాల్గొన్నారు.
Next Story