అయోధ్య రామాలయ ప్రధాన పూజారి కన్నుమూత
అయోధ్య రామాయల ప్రారంభోత్సవం, బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ సమయంలో ముఖ్యపాత్ర పోషించిన ఆచార్య సత్యేంద్ర దాస్
![అయోధ్య రామాలయ ప్రధాన పూజారి కన్నుమూత అయోధ్య రామాలయ ప్రధాన పూజారి కన్నుమూత](https://www.teluguglobal.com/h-upload/2025/02/12/1402664-priest-acharya-satyendra-das.webp)
అయోధ్య రామాలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ కన్నుమూశారు. లఖ్‌నవూలోని సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎస్‌జీపీజీఐ)లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. సత్యేంద్ర దాస్ మధుమేహం, బీపీతో బాధపడుతూ ఆదివారం ఆస్పత్రిలో చేరిన విషయం విదితమే. బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో ఎస్‌జీపీజీఐలో చికిత్స తీసుకుంటూ బుధవారం తుదిశ్వాస విడిచారు. అయోధ్య రామాయల ప్రారంభోత్సవం, బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ సమయంలో ఆయన ముఖ్యపాత్ర పోషించారు.
1992 డిసెంబర్ 6న బాబ్రీ మసీదు కూల్చివేసిన సమయంలో సత్యేంద్రదాస్ తాత్కాలిక రామ మందిరానికి పూజారిగా ఉన్నారు. కూల్చివేతకు ముందు విగ్రహాలను సమీపంలోని ఫకిరే మందిరానికి తరలించి, రామజన్మభూమిలోని తాత్కాలిక ఆలయంలో ఉంచి పూజలు చేశారు. 20 ఏళ్ల వయసులో నిర్వాణి అఖాడాలో చేరి ఆధ్యాత్మిక దీక్ష తీసుకున్నారు.