Telugu Global
National

జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరించే యోచనలో కేంద్రం?

ఈ విషయాన్ని చర్చించడానికే అమిత్‌ షాతో ఒమర్‌ అబ్దుల్లా భేటీ అయినట్లు సమాచారం

జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరించే యోచనలో కేంద్రం?
X

జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించే యోచనలో కేంద్రం ఉన్నట్లు సమాచారం. జమ్మూ కశ్మీర్‌ కేంద్ర పాలిత ప్రాంతంగా మారిన తర్వాత మొదటిసారి ఇటీవల ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ఎన్సీ-కాంగ్రెస్‌ కూటమి విజయం సాధించింది. ఒమర్‌ అబ్దుల్లా సీఎంగా బాధ్యలు చేపట్టారు. అనంతరం మొదటి సమావేశంలోనే జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని రాష్ట్ర క్యాబినెట్‌ తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. దీన్ని లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా కూడా ఆమోదించారు.

ఈ నేపథ్యంలోనే ఈ విషయాన్ని చర్చించడానికే బుధవారం కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాతో సీఎం అబ్దుల్లా బుధవారం భేటీ అయ్యారని తెలుస్తోంది. ఈ భేటీలో కొత్తగా ఎన్నికైన ప్రభుత్వానికి కేంద్రం మద్దతు తెలుపడంతో పాటు, రాష్ట్ర హోదా పునరుద్ధరణపై అమిత్‌ షా హామీ ఇచ్చినట్లు సమాచారం. మరోవైపు సీఎం ఒమర్‌ అబ్దుల్లా నేడు ప్రధాని మోడీని కలిసి తీర్మాన ప్రతిని అందిస్తారని అంటున్నారు. ఈ మేరకు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.

First Published:  24 Oct 2024 2:58 PM IST
Next Story