Telugu Global
National

సీబీఐలో ఎస్పీ క్యాడర్‌ పోస్టుల నిబంధనల్లో మార్పులు

50 శాతం పోస్టులు డెప్యూటేషన్‌తో భర్తీ.. మిగలిన సగం పోస్టులు ప్రమోషన్‌లతో భర్తీ

సీబీఐలో ఎస్పీ క్యాడర్‌ పోస్టుల నిబంధనల్లో మార్పులు
X

సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)లో ఎస్పీ క్యాడర్‌ పోస్టుల భర్తీ నిబంధనలను కేంద్ర ప్రభుత్వం సవరించింది. 50 శాతం ఎస్పీ పోస్టులను ఐపీఎస్‌ ఆఫీసర్‌లతో భర్తీ చేయనుంది. మిగిలిన సగం పోస్టులు సీబీఐలో అడిషనల్‌ ఎస్పీ క్యాడర్‌లో ఉన్న ఆఫీసర్లకు ప్రమోషన్లు ఇవ్వడం ద్వారా ఫిలప్‌ చేయనుంది. ప్రస్తుతం సీబీఐలో 122 ఎస్పీ క్యాడర్‌ పోస్టులు ఉన్నాయి. వీటిలో సగం పోస్టులు అంటే 61 పోస్టులను ఐపీఎస్‌ ఆఫీసర్లతో డెప్యూటేషన్‌ పద్ధతిలో భర్తీ చేస్తారు. మిగిలిన 61 పోస్టులు సీబీఐలోనే అడిషనల్‌ ఎస్పీ క్యాడర్‌లో పని చేస్తున్న వారికి ప్రమోషన్‌లు ఇచ్చి భర్తీ చేస్తారు. సీబీఐలో డెప్యూటేషన్‌ పద్ధతిలో ఎస్పీలుగా పని చేయడానికి ఏ స్టేట్‌ క్యాడర్‌ ఐపీఎస్‌ ఆఫీసర్‌ అయినా (ఎస్పీ ర్యాంక్‌లో ఉన్న అధికారి) దరఖాస్తు చేసుకోవచ్చు. సంబంధిత క్యాడర్‌ స్టేట్‌ ఎన్‌వోసీ ఇస్తే సీబీఐలో ఎస్పీలుగా పోస్టింగ్‌ ఇస్తారు.

First Published:  5 Dec 2024 6:54 PM IST
Next Story