Telugu Global
National

ఆర్బీఐకి బాంబు బెదిరింపు

నెల రోజుల వ్యవధిలో ఇది రెండోసారి

ఆర్బీఐకి బాంబు బెదిరింపు
X

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ)కు బాంబు బెదిరింపు ఈ-మెయిల్‌ వచ్చింది. బ్యాంకును పేల్చేస్తామంటూ రష్యన్‌ భాషలో గుర్తు తెలియని వ్యక్తులు దీన్ని పంపించారు. దీనికి సంబంధించి ముంబయిలోని మాతా రమాబాయ్‌ మార్గ్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నెల వ్యవధిలో ఇలాంటి సంఘటన జరగడం ఇది రెండోసారి .

నిందితుడిని పట్టుకోవడానికి పోలీసులు గాలిస్తున్నారని బ్యాంకు అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా.. ఈ ఏడాది నవంబర్‌ 16న ఆర్బీఐ కస్టమర్‌ కేర్‌ నంబర్‌కు బాంబు బెదిరింపు కాల్‌ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో కాల్‌ చేసిన వ్యక్తి లష్కరే తోయిబా సీఈవోగా తనను తాను పేర్కొన్నాడు. బెదిరించే ముందు ఫోన్‌లో పాట పాడినట్లు తెలుస్తోంది. లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ 2008లో ముంబయి దాడులకు పాల్పడిన సంగతి తెలిసిందే.

First Published:  13 Dec 2024 11:26 AM IST
Next Story