Telugu Global
National

హర్యానాలో హాట్రిక్‌ దిశగా బీజేపీ

మ్యాజిక్‌ ఫిగర్‌ను దాటిన కాషాయపార్టీ

హర్యానాలో హాట్రిక్‌ దిశగా బీజేపీ
X

హర్యానాలో ఎగ్జిట్‌పోల్స్‌ అంచనాలను తలకిందులు చేస్తూ బీజేపీ హాట్రిక్ దిశగా దూసుకెళ్తున్నది. ప్రారంభంలో వెనుకబడిన కాషాయపార్టీ క్రమంగా పుంజుకుంటూ ఆధిక్యంలోకి వచ్చింది. మ్యాజిక్‌ ఫిగర్‌కు చేరువగా వచ్చింది. ప్రస్తుతం బీజేపీ 45 చోట్ల ఆధిక్యంలో ఉండగా.. కాంగ్రెస్‌ అభ్యర్థులు 38 చోట్ల ముందంజలో ఉన్నారు.హర్యానాలో మొత్తం 90 స్థానాలున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు 46 స్థానాలు అవసరం. ప్రస్తుతం ఇక్కడ బీజేపీ 47 చోట్ల ముందంజలో ఉండగా.. కాంగ్రెస్‌ 37 స్థానాల్లోనే ఆధిక్యంలో కొనసాగుతున్నది. ఇతరులు ఐదు చోట్ల, ఐఎన్‌ఎల్‌డీ రెండు స్థానాల్ఓ ఆధిక్యంలో ఉన్నది. ఆమ్‌ ఆద్మీ పార్టీ ఇక్కడ ఖాతా తెరవకపోవడం గమనార్హం.

హర్యానా సీఎం నాయబ్‌ సింగ్‌ లాడ్‌వాలో లీడ్ లో కొనసాగుతున్నారు. కైథాల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి ఆదిత్య సూర్జేవాలా ముందంజలో ఉన్నారు. మాజీ సీఎం, కాంగ్రెస్‌ అభ్యర్థి భూపిందర్‌ హుడా ఆధిక్యంలో కొనసాగుతున్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థిపై స్వతంత్ర అభ్యర్థి సావిత్రి జిందాల్‌ ఆధిక్యంలో కొనసాగుతుండగా.. జేజేపీ అభ్యర్థి, మాజీ డిప్యూటీ సీఎం దుష్యంత్‌ చౌతాలా వెనుకంజలో ఉన్నారు. ఆరు రౌండ్ల తర్వాత వినేష్ ఫోగట్ వెనుకంజలో ఉన్నారు.

First Published:  8 Oct 2024 7:04 AM GMT
Next Story