Telugu Global
National

కాసేపట్లో బిహార్‌ కేబినెట్‌ విస్తరణ

అసెంబ్లీ ఎన్నికలకు ముందు మంత్రివర్గంలోకి ఏడుగురు!

కాసేపట్లో బిహార్‌ కేబినెట్‌ విస్తరణ
X

అసెంబ్లీ ఎన్నికలకు ముంగిట బిహార్‌ మంత్రివర్గంలో ఏడుగురికి చాన్స్‌ ఇవ్వబోతున్నారు. బిహార్‌ కేబినెట్‌ లో ఆరు బెర్త్‌ లు ఖాళీగా ఉండగా ఇటీవల ఒక మంత్రి రాజీనామా చేశారు. నితీశ్‌ కుమార్‌ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వంలో కొత్తగా ఐదుగురు బీజేపీ, ఇద్దరు జేడీయూ ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సాయంత్రం 4 గంటలకు గవర్నర్‌ కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. బిహార్‌ సీఎం నితీశ్‌ కుమార్ సహా 30 మంది మంత్రులు ఉన్నారు. ఇందులో బీజేపీ నుంచి 15 మంది, జేడీయూ నుంచి 13 మంది, హిందుస్థాని అవామ్‌ మోర్చా నుంచి ఒకరు, ఇండిపెండెంట్‌ సభ్యుడు ఒకరు మంత్రిగా ఉన్నారు. రెవెన్యూ శాఖ మంత్రి, బిహార్‌ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్‌ జైస్వాల్‌ మంత్రిపదవికి రాజీనామా చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ సమాయత్తం చేయడమే లక్ష్యంగా ఆయన కేబినెట్‌ నుంచి తప్పుకున్నట్టు తెలుస్తోంది. సంజయ్‌ సరౌగి, సునీల్‌ కుమార్‌, జిబేశ్‌ కుమార్‌ రహు కుమార్‌ సింగ్‌, మోతిలాల్‌ ప్రసాద్‌, విజయ్‌ కుమార్‌ మండల్‌, కృష్ణన్‌ కుమార్‌ మాంటో ఈ రోజు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బిహార్‌ గవర్నర్‌ ఆరిఫ్‌ మహ్మద్‌ ఖాన్‌ వీరితో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.

First Published:  26 Feb 2025 3:30 PM IST
Next Story