Telugu Global
National

ఆయుష్మాన్‌ భారత్‌ సీనియర్‌ సిటిజన్‌ ఎన్‌రోల్‌మెంట్‌

అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు లేఖ రాసిన కేంద్ర ఆరోగ్యశాఖ అదనపు కార్యదర్శి చాంగ్‌సన్‌

ఆయుష్మాన్‌ భారత్‌ సీనియర్‌ సిటిజన్‌ ఎన్‌రోల్‌మెంట్‌
X

ఆయుష్మాన్‌ భారత్‌ ఆరోగ్య బీమా పథకాన్ని 70 ఏండ్లు, ఆ పైబడిన వారందరికీ వర్తింపజేయనున్నట్లు కేంద్రం ఇటీవల ప్రకటించిన విషయం విదితమే. దీనికి సంబంధించిన ప్రయోజనాలు కల్పించడంలో భాగంగా అర్హులైన వారి పేర్లను నమోదు ప్రక్రియ చేపట్టాలని అన్ని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ఆరోగ్య శాఖ సూచించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ అదనపు కార్యదర్శి చాంగ్‌సన్‌ అన్ని రాష్ట్రాలకు లేఖ రాశారు.

ఈ పథకంతో లబ్ధి పొందాలనుకునే సీనియర్‌ సిటీజన్లు నమోదు కోసం ఆయుష్మాన్‌ మొబైల్‌ యాప్‌, వెబ్‌సైట్‌ లో (Beneficiary.nha.gov.in) ప్రత్యేక విభాగం ఏర్పాటు చేసినట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. వీటిలో నమోదు చేసుకున్న అర్హులందరికీ ప్రత్యేకంగా ఆయుష్మాన్‌ కార్డులు జారీ చేస్తామని తెలిపింది. ఈ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని, పథకం కూడా త్వరలోనే అమల్లోకి వస్తుందని పేర్కొన్నది.

ఇప్పటికే ఏబీ పీఎంజేఏవై కింద ప్రయోజనం పొందుతున్న కుటుంబాలతో పాటు ఇప్పటివరకు ఈ పథకం కింద లేనివారికీ ఇది వర్తిస్తుందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. 70 ఏండ్ల వయసు ఉండటమే ఇందుకు అర్హతని స్పష్టం చేసింది. ఇతర బీమా పథకాల్లో లబ్ధి దారులుగా కొనసాగుతున్న వారి కూడా దీనిద్వారా లబ్ధి పొందవచ్చని సూచించింది.

First Published:  29 Sept 2024 4:46 PM GMT
Next Story