ఢిల్లీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఆతిశీ
ఢిల్లీకి తొలి మహిళా ప్రతిపక్ష నేతగా నిలువనున్న ఆ రాష్ట్ర మాజీ సీఎం
BY Raju Asari23 Feb 2025 3:31 PM IST

X
Raju Asari Updated On: 23 Feb 2025 3:31 PM IST
ఢిల్లీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా మాజీ సీఎం ఆతిశీని ఎంపికయ్యారు. ఈ మేరకు ఆప్ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్ ఆధ్వర్యంలో ఆపార్టీ 22 మంది ఎమ్మెల్యేలు సమావేశమై ఆప్ శాసనసభా పక్ష నేతగా ఆతిశీని ఎన్నుకున్నారు. దీంతో ఢిల్లీకి తొలి మహిళా ప్రతిపక్ష నేతగా ఆతిశీ నిలువనున్నారు. సీఎంగా ఇప్పటికే బీజేపీ మహిళా నేత రేఖా గుప్తా బాధ్యతలు చేపట్టారు. సోమవారం నుంచి ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 48 సీట్లతో విజయం సాధించగా.. ఆప్ 22 స్థానాలను మాత్రమే దక్కించుకున్నది.
Next Story