Telugu Global
National

కృష్ణా ట్రిబ్యునల్‌ పై సుప్రీం కోర్టుకు ఏపీ

ట్రిబ్యునల్‌ విచారణకు ముందే తమ వాదన వినాలని విజ్ఞప్తి

కృష్ణా ట్రిబ్యునల్‌ పై సుప్రీం కోర్టుకు ఏపీ
X

ఇంటర్‌ స్టేట్‌ వాటర్‌ డిస్ప్యూట్స్‌ యాక్ట్‌ 1956లోని సెక్షన్‌ 3 కింద తెలంగాణ, ఏపీ మధ్య మధ్య కృష్ణా జలాల పంపిణీని కేంద్ర ప్రభుత్వం కృష్ణా వాటర్‌ డిస్ప్యూట్స్‌ ట్రిబ్యునల్‌ -2 అప్పగించడంపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌ ను గురువారం జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ కోటేశ్వర్‌ సింగ్‌ తో కూడిన ధర్మాసనం విచారించింది. తెలంగాణ భూభాగంలో కృష్ణా పరీవాహక ప్రాంతం ఎక్కువగా ఉండటంతో తమకు 70 శాతం నీటి వాటా ఇవ్వాలని తెలంగాణ డిమాండ్‌ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే కేంద్రం నీటి పంపిణీ అంశాన్ని ట్రిబ్యునల్‌ కు రెఫర్‌ చేసింది. కేంద్రం ఇచ్చిన టీవోఆర్‌ను ఏపీ సుప్రీంలో సవాల్‌ చేసింది. సుప్రీం కోర్టులో తమ పిటిషన్‌ పెండింగ్‌లో ఉండగానే నీటి పంపకాల అంశంపై కేడబ్ల్యూడీటీ -2 ఫిబ్రవరి 19 నుంచి వాదనలు విననుందని.. ఈ నేపథ్యంలో తమ వాదనను అంతకన్నా ముందే వినాలని సుప్రీం కోర్టులో స్పెషల్‌ మెన్షన్‌ ఫైల్‌ చేసింది. దీనిపై స్పందించిన ధర్మాసనం ఫిబ్రవరి 13న మధ్యాహ్నం 2 గంటలకు ఇరు రాష్ట్రాలతో పాటు కేంద్రం వాదనలు వింటామని చెప్తూ.. విచారణను ఆరోజుకు వాయిదా వేసింది.

First Published:  23 Jan 2025 7:24 PM IST
Next Story