ఆరు కొరడా దెబ్బలు తిన్న అన్నామలై
అన్నాయూనివర్సిటీలో ఓ విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన పెద్ద దుమారం.. డీఎంకే ఫైర్ అయిన అన్నామలై

తమిళనాడు రాజధాని చెన్నైలోని అన్నాయూనివర్సిటీలో ఓ విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన పెద్ద దుమారం రేపుతున్నది. దీంతో అధికార డీఎంకేపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె. అన్నామలై ఆరు కొరడా దెబ్బలు భరించి.. మురుగన్‌కు మొక్కు చెల్లించుకున్నారు.
గురువారం అన్నామలై మీడియాలో మాట్లాడుతూ.. డీఎంకే ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. డీంకే ప్రభుత్వాన్ని గద్దెదించే వరకు నేను చెప్పులు ధరించను. చెప్పులు లేకుండానే నడుస్తాను. ఎన్నికల్లో విజయం సాధించడానికి డబ్బులు ఎరగా చూపమన్నారు. రూపాయి కూడా పంచకుండా ఎన్నికలకు వెళ్తామన్నారు. ఎన్నికల్లో విజయం సాధించేంతవరకు చెప్పులు ధరించను అని అన్నామలై అన్నారు. అంతేకాకుండా రాష్ట్రంలో చెడు అంతమైపోవాలని కోరుతూ కోయంబత్తూరులోని తన నివాసంలో ఆరు కొరడా దెబ్బలు భరించి.. మురుగున్‌కు మొక్కు చెల్లించుకుంటానని అన్నారు. రాష్ట్రంలో ఆరు మురుగన్ క్షేత్రాలను దర్శించుకోవడానికి 48 గంటల పాటు ఉపవాస దీక్ష చేపడుతానన్నారు. ఆ మాట ప్రకారమే శుక్రవారం కోయంబత్తూర్‌లోని తన ఇంటి వద్ద బీజేపీ మద్దతుదారులు, మీడియా సమక్షంలో మొక్కు చెల్లించుకున్నారు.