Telugu Global
National

జమ్మూకశ్మీర్‌ కు ప్రత్యేక ప్రతిపత్తిని అంబేద్కర్‌ వ్యతిరేకించారు

న్యాయశాఖ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్‌వాల్‌

జమ్మూకశ్మీర్‌ కు ప్రత్యేక ప్రతిపత్తిని అంబేద్కర్‌ వ్యతిరేకించారు
X

జమ్మూకశ్మీర్‌ కు ప్రత్యేక ప్రతిపత్తిని డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ వ్యతిరేకించారని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్‌వాల్‌ అన్నారు. అంబేద్కర్‌ లేని సమయంలోనే ఆర్టికల్‌ 370ని రాజ్యాంగ పరిషత్‌ హడావిడిగా ఆమోదించిందని చెప్పారు. విద్యార్థుల కోసం భారత రాజ్యాంగం పేరుతో ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. రాజ్యాంగ పరిషత్‌ ముందుకు వచ్చిన అన్ని అంశాలపై మొదట మాట్లాడింది అంబేద్కరేనని తెలిపారు. రోజూ జరిగే చర్చలకు అంబేద్కర్‌ సమాధానాలు చెప్పేవారని అన్నారు. రాజ్యాంగ పరిషత్‌ రికార్డులే దీనిని స్పష్టం చేస్తున్నాయని వివరించారు. జమ్మూకశ్మీర్‌ కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370ని అంబేద్కర్‌ వ్యతిరేకిస్తే ఆమోదించాలని జవహర్‌ లాల్‌ నెహ్రూ పట్టుబట్టారని, రాజ్యాంగ ముసాయిదా కమిటీలో మరో సభ్యుడికి ఆర్టికల్‌ 370కి ఆమోదం పొందే బాధ్యత అప్పగించారని వివరించారు. అంబేద్కర్‌ ఆస్పత్రికి వెళ్లిన సమయంలో ఆర్టికల్‌ 370కి ఆమోదం తెలిపారని చెప్పారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ నిజమైన దేశ భక్తుడని మేఘ్‌వాల్‌ అన్నారు.

First Published:  25 Nov 2024 5:23 PM IST
Next Story