Telugu Global
National

ఏప్రిల్‌ 8,9 తేదీల్లో ఏఐసీసీ కీలక సమావేశాలు

ఏప్రిల్‌ 8న సీడబ్ల్యూసీ సమావేశం, ఏప్రిల్ 9న ఏఐసీసీ ప్రతినిధుల సమావేశం ఉంటుందని పేర్కొన్న కేసీ వేణుగోపాల్

ఏప్రిల్‌ 8,9 తేదీల్లో ఏఐసీసీ కీలక సమావేశాలు
X

కాంగ్రెస్‌ పార్టీ కీలక సమావేశాలకు గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ వేదిక కానున్నది. గత ఏడాది డిసెంబర్‌లో కర్ణాటకలోని బెళగావిలో జరిగిన నవ సత్యాగ్రహంలో తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా ఏప్రిల్‌ 8,9 తేదీల్లో ఇక్కడ ఏఐసీసీ సమావేశాలు నిర్వహించనున్నట్లు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ వెల్లడించారు. ఈ మేరకు 'ఎక్స్‌'లో ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఏప్రిల్‌ 8న సీడబ్ల్యూసీ సమావేశం, ఏప్రిల్ 9న ఏఐసీసీ ప్రతినిధుల సమావేశం ఉంటుందని పేర్కొన్నారు. ఈ రెండు సమావేశాలకు మల్లికార్జున ఖర్గే అధ్యక్షత వహిస్తారని తెలిపారు.

ఈ కీలక భేటీ దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్‌ నేతలను ఒకచోటకు చేర్చడమే కాకుండా బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాల వల్ల ఎదురయ్యే సవాళ్లు, రాజ్యాంగం, దాని విలువలపై నిరంతరం జరుగుతున్న దాడిపై చర్చించి భవిష్యత్తు కార్యాచరణను రూపొందిస్తుందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ ఛైర్‌పర్సన్‌ సోనియా గాంధీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల సీఎంలు, పార్టీ జాతీయ ఆఫీస్‌ బేరర్లు, సీనియర్‌ నేతలు, ఇతర ప్రతినిధులు పాల్గొననున్నారు.

First Published:  23 Feb 2025 5:37 PM IST
Next Story