Telugu Global
National

అదానీ వ్యవహారం.. పార్లమెంటులో కొనసాగుతున్న వాయిదాల పర్వం

లోక్‌సభను కుదిపేసిన అదానీ, మణిపూర్‌ అంశాలు

అదానీ వ్యవహారం.. పార్లమెంటులో కొనసాగుతున్న వాయిదాల పర్వం
X

పార్లమెంటు శీతాకాల సమావేశాల బుధవారం తిరిగి ప్రారంభమయ్యాయి. పారిశ్రామికవేత్త గౌతమ్‌ అదానీపై అమెరికాలో అభియోగాలు నమోదైన వ్యవహారంపై చర్చ జరపాలని కాంగ్రెస్‌ వాయిదా తీర్మానం ఇచ్చింది. వివక్షాలు ఈ అంశాన్ని లేవనెత్తడంతో ఉభయసభల కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడింది. దాంతో లోక్‌సభ అలా ప్రారంభమై.. ఇలా వాయిదా పడింది. మధ్యాహ్నం 12 గంటలకు తిరిగి ప్రారంభం కానున్నది. రాజ్యసభను కూడా ఛైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌ 11.30 గంటల వరకు వాయిదా వేశారు.

విపక్ష నేత రాహుల్‌ గాంధీ స్పందిస్తూ.. అదానీని అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. చిన్నచిన్న ఆరోపణపై ఎంతోమంది అరెస్టు చేస్తున్నారు. వేల కోట్ల కుంభకోణంలో అదానిని జైలులో పెట్టాలన్నారు. అయితే ఆయనను మోదీ ప్రభుత్వమే రక్షిస్తున్నదని విమర్శించారు.

First Published:  27 Nov 2024 11:48 AM IST
Next Story