942 మందికి పోలీస్ పతకాలు
ఈ పురస్కారాల్లో తెలంగాణ నుంచి 12 మందికి మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్ పతకాలు

రిపబ్లిక్ డేను పురస్కరించుకొని కేంద్ర హోం శాఖ పోలీస్, ఫైర్ సర్వీస్, హోంగార్డ్, సివిల్ డిఫెన్స్ అధికారులకు వివిధ పోలీసు పతకాలను ప్రకటించింది. దేశవ్యాప్తంగా 942 మందికి గ్యాలంట్రీ/ సర్వీస్ పతకాలు అందజేయనున్నది. ఈ మేరకు శనివారం అవార్డుల జాబితాను విడుదల చేసింది. ఇందులో 95 మందికి మెడల్ ఫర్ గ్యాలంట్రీ, ఇద్దరికి ప్రెసిడెంట్ మెడల్ ఫర్ గ్యాలంటరీ, 101 మందికి రాష్ట్రపతి విశిష్ట సేవా పతకాలు, 746 మందికి పోలీస్ విశిష్ఠ సేవా (మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్) పతకానలు ప్రకటించింది.
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచి ఎంపికైంది వీరే
ఈ పురస్కారాల్లో తెలంగాణ నుంచి 12 మందికి పోలీస్ విశిష్ట సేవా(మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్) పతకాలు దక్కాయి. తెలంగాణ నుంచి పోలీస్ కమిషనర్ విక్రమ్ సింగ్ మన్, ఎస్పీ మెట్టు మాణిక్ రాజ్ రాష్ట్రపతి విశిష్ట సేవా పతకాలను ఎంపికయ్యారు. ఏపీ నుంచి చీఫ్ హెడ్ వార్డర్ కడాలి అర్జునరావు, వార్డర్ ఉండ్రాజవరపు వీర వెంకట సత్యనారాయణకు కరెక్షనల్ సర్వీస్ విభాగంలో పోలీస్ విశిష్ఠ సేవా పతకాలు దక్కాయి. స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవాలను పురస్కరించుకొని కేంద్ర హోం శాఖ ఏటా రెండుసార్లు ఈ పోలీస్ పతకానలు ప్రకటిస్తుంది.