Telugu Global
National

పెళ్లికి వెళుతుండగా పెను విషాదం.. కారు వాగులో కొట్టుకుపోయి ఏడుగురు మృతి

హిమాచల్‌ ప్రదేశ్‌లోని మెహత్పూర్‌ సమీపంలోని డెహ్రా నుంచి పంజాబ్‌లోని ఎస్బీఎస్‌ నగర్‌ లోని మెహ్రావాల్‌ గ్రామంలో జరిగే వివాహ వేడుకకు వెళ్తుండగా ఈ ఘటన జరిగిందని పోలీసులు వెల్లడించారు.

పెళ్లికి వెళుతుండగా పెను విషాదం.. కారు వాగులో కొట్టుకుపోయి ఏడుగురు మృతి
X

పెళ్లి వేడుకకు కారులో బయల్దేరిన ఓ కుటుంబం ప్రాణాలు కోల్పోయింది. ఈ పెను విషాదం పంజాబ్‌లో చోటుచేసుకుంది. భారీ వర్షాల నేపథ్యంలో ఉప్పొంగి ప్రవహిస్తున్న ఓ వాగులో వీరి కారు కొట్టుకుపోవడంతో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతిచెందగా, మ‌రో ముగ్గురు గల్లంతయ్యారు.

హిమాచల్‌ ప్రదేశ్‌లోని మెహత్పూర్‌ సమీపంలోని డెహ్రా నుంచి పంజాబ్‌లోని ఎస్బీఎస్‌ నగర్‌ లోని మెహ్రావాల్‌ గ్రామంలో జరిగే వివాహ వేడుకకు వెళ్తుండగా ఈ ఘటన జరిగిందని పోలీసులు వెల్లడించారు. జైజోన్‌ అనే ప్రాంతంలో ఉప్పొంగి ప్రవహిస్తున్న వాగును దాటుతుండగా వాగు ఉధృతికి కారు కొట్టుకుపోయింది.

ప్రమాదానికి గురైన కారులో డ్రైవర్‌తో పాటు మొత్తం 11 మంది ఉన్నారు. స్థానికులు ఒకరిని రక్షించి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. ఈ ఘటనపై డీఎస్పీ జాగిర్‌ సింగ్‌ మాట్లాడుతూ.. ఏడుగురి మృతదేహాలను గుర్తించామన్నారు. వారిలో ఇద్దరు మహిళలు ఉన్నారని తెలిపారు. గల్లంతైన వారి కోసం గాలింపు కొనసాగిస్తున్నట్టు చెప్పారు. మృతులందరూ ఒకే కుటుంబానికి చెందినవారు కావడం మరింత విషాదకరం.

First Published:  11 Aug 2024 7:12 PM IST
Next Story