Telugu Global
National

బద్రీనాథ్‌లో విరిగిపడిన మంచు చరియలు.. చిక్కుకున్న 57 మంది కార్మికులు

కార్మికులు అక్కడ రోడ్డు నిర్మాణ పనులు చేస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం

బద్రీనాథ్‌లో విరిగిపడిన మంచు చరియలు.. చిక్కుకున్న 57 మంది కార్మికులు
X

ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్‌లో భారీగా మంచు కురుస్తున్నది. ఈ క్రమంలో బద్రీనాథ్‌ ధామ్‌లోని హైవేపై మంచు చరియలు విరిగిపడటంతో 57 మంది చిక్కుకున్నట్లు తెలుస్తోంది. వీరంతా అక్కడి రోడ్డు నిర్మాణ కార్మికులుగా గుర్తించారు. థామ్‌లోని జాతీయ హైవేపై ఈ ఘటన చోటుచేసుకున్నది. సమాచారం అందుకున్న పోలీసులు, బోర్డర్‌ రోడ్స్‌ ఆర్గనైజేషన్‌ (బీఆర్‌ఓ) సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. కార్మికులు అక్కడ రోడ్డు నిర్మాణ పనులు చేస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

బద్రీనాథ్‌కు సమీపంలో ఉన్న మనా గ్రామంలో బీఆర్‌వో క్యాంప్‌కు సమీపంలోనే ఈ ఘటన చోటు చేసుకున్నది. మొత్తం 57 మంది కార్మికులు మంచు చరియల కింద చిక్కుకుపోయినట్లు బీఆర్‌వో ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ సీఆర్‌ మీనా వెల్లడించారు. ఇందులో 10 మందిని రక్షించి క్యాంప్‌నకు తరలించారు. మిగతా వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఘటనా స్థలంలో అంబులెన్స్‌లను సిద్ధంగా ఉంచారు. అయితే మంచు దట్టంగా పడుతుండటంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటం కలగుతున్నదని బీఆర్‌వో అధికారులు వెల్లడించారు.

First Published:  28 Feb 2025 2:24 PM IST
Next Story