అమెరికా నుంచి మరో అక్రమ వలసదారుల విమానం రేపు భారత్‌కు రానున్నదని సమాచారం. విమానంలో 170-180 మంది, మరో విమానంలో మరికొంతమంది వచ్చే అవకాశం ఉన్నది సంబంధిత వర్గాలు తెలిపాయి. తమ దేశంలో ఉంటున్న అక్రమంగా ఉంటున్న వలసదారులను స్వదేశాలకు పంపుతున్న అమెరికా ఈ నెల 105 మంది భారతీయులను సైనిక విమానంలో భారత్‌కు తరలించింది. అగ్రరాజ్యం బహిష్కరించనున్న తుది జాబితాలో 487 మంది భారతీయులు ఉన్నట్లు విదేశాంగశాఖ ప్రకటించింది. వారిలో అత్యధికంగా గుజరాతీలు, పంజాబ్, హర్యానాకు చెందినవారు ఉన్నట్లు సమాచారం. మరోవైపు అక్రమవలసదారులను తీసుకువస్తున్న అమెరికా సైనిక విమానం అమృత్‌సర్‌లో ల్యాండింగ్ చేయడంపై పంజాబ్ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తున్నది. తమ రాష్ట్ర ప్రతిష్ఠను దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే విమానాలను అమృత్‌సర్‌లో ల్యాండింగ్ చేస్తున్నారని .. హర్యానా, గుజరాత్‌లో ఎందుకు చేయడం లేదని ప్రశ్నిస్తున్నది.
Previous Articleకులగణన, ఎస్సీ వర్గీకరణపై నేడు పీసీసీ పవర్ పాయింట్ ప్రజంటేషన్
Next Article స్వదేశానికి బయలుదేరిన ప్రధాని
Keep Reading
Add A Comment