గణేష్ నిమజ్జనం.. అర్థరాత్రి 2 గంటల వరకు మెట్రో
భాగ్యనగరంలో గణేశ్ నిమజ్జనం దృష్ట్యా హైదరాబాద్ మెట్రో ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
భాగ్యనగరంలో గణేశ్ నిమజ్జనం దృష్ట్యా హైదరాబాద్ మెట్రో ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఈ నెల 17న అర్ధరాత్రి 2 గంటల వరకు మెట్రో రైళ్లు నడుస్తాయని మెట్రోరైల్ సంస్థ వెల్లడించింది. చివరి స్టేషన్‌లో నుంచి రాత్రి 1 గంటకు చివరి రైలు బయలుదేరుతుందని పేర్కొంది. నిమజ్జనం ముగిసే వరకు అవసరాన్ని బట్టి అదనపు రైళ్లు నడుపుతామని తెలిపింది. మరో వైపు ఆదివారం ఖైరతాబాద్ గణపతి దర్శనానికి భక్తులు పోటెత్తడంతో మెట్రో స్టేషన్‌లు కిటకిటలాడుతున్నాయి. శనివారం ఒక్క రోజే ఖైరతాబాద్ మెట్రో స్టేషన్‌ను 94వేల మంది ప్రయాణికులు వినియోగించుకున్నారు.
పోటెత్తిన భక్తులు
మరోవైపు ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వరుస సెలవుల నేపథ్యంలో భక్తులు భారీగా పోటెత్తారు. శనివారం కంటే ఆదివారం భక్తుల రద్దీ మరింత పెరిగింది. దీంతో ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ చుట్టు పక్కల ప్రాంతాలు కిక్కిరిసిపోయి కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తులు త్వరగా వినాయకుడిని దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేశాగణేష్ నిమజ్జనం.. అర్థరాత్రి 2 గంటల వరకు మెట్రోరు. ఇక సోమవారం భక్తుల దర్శనాలకు అనుమతులు నిలిపివేసి నిమజ్జనానికి నిర్వాహకులు ఏర్పాట్లు చేయనున్నారు.