Telugu Global
NEWS

ఆ ప్రత్యేకమైన వ్యక్తిని పరిచయం చేసిన ప్రభాస్

టాలీవుడ్ లో ప్రస్తుతం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ ఎవరు అనగానే టక్కున గుర్తొచ్చే పేరు ప్రభాస్. ఇప్పుడు ఆయన వయసు 44 ఏళ్ళు.

ఆ ప్రత్యేకమైన వ్యక్తిని పరిచయం చేసిన ప్రభాస్
X

తన జీవితంలోకి ఒక ప్రత్యేకమైన వ్యక్తి త్వరలో వస్తున్నారని.. వివరాల కోసం ఎదురుచూడాలని ప్రభాస్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టగానే అది ప్రభాస్ పెళ్లి విషయమనే అందరూ ఫిక్స్‌ అయిపోయారు. అమ్మాయి ఎవరంటూ.. ఆరా తీయడం మొదలుపెట్టారు. గతంలో ప్రభాస్ ప్రేమలో ఉన్నది వీరేనంటూ కొందరి పేర్లు కూడా బయటకు తెచ్చారు. అయితే అలాంటి వారందరికీ ప్రభాస్ షాక్ ఇచ్చాడు. తన జీవితంలో ప్రత్యేకమైన వ్యక్తి అంటే తాను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి కాదని.. తాను తాజాగా నటిస్తున్న 'కల్కి 2898 ఏడీ' సినిమాలో ఓ పాత్ర అని తాజాగా విడుదల చేసిన వీడియోతో ప్రభాస్ క్లారిటీ ఇచ్చాడు.

ప్రభాస్ ప్రస్తుతం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో 'కల్కి 2898 ఏడీ' అని మూవీలో నటిస్తున్నాడు. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ గా ఈ మూవీ తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమా నుంచి ఒక గ్లింప్స్ ని మేకర్స్ విడుదల చేశారు. ఈ వీడియో ద్వారా బుజ్జి అనే చిన్న రోబోను పరిచయం చేశారు. బుజ్జికి వాయిస్ ను హీరోయిన్ కీర్తి సురేష్ ఇచ్చారు. ఈ వీడియో చూస్తుంటే రజినీ కాంత్ రోబోలో చిట్టి పాత్ర లాగే.. కల్కిలో బుజ్జి పాత్ర కూడా హైలైట్ అవుతుందని అనిపిస్తోంది. బుజ్జి గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే మే 22 వరకు వేచి ఉండాలని వీడియోలో మేకర్స్ పేర్కొన్నారు.


టాలీవుడ్ లో ప్రస్తుతం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ ఎవరు అనగానే టక్కున గుర్తొచ్చే పేరు ప్రభాస్. ఇప్పుడు ఆయన వయసు 44 ఏళ్ళు. ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు బతికి ఉన్నప్పటి నుంచి ప్రభాస్ కు సంబంధించిన పెళ్లి కబురు ఏదో ఒకటి వినపడుతూనే ఉంది. ఈ ఏడాదిలో ప్రభాస్ పెళ్లి అవుతుంది.. వచ్చే ఏడాదిలోగా పూర్తవుతుంది.. అని ప్రభాస్ కుటుంబ సభ్యులు చెప్పేవారు. అయితే ఎప్పటికప్పుడు ప్రభాస్ పెళ్లి వాయిదా పడుతూ వస్తూనే ఉంది. ఇంతలో ప్రభాస్ తన జీవితంలోకి ఒక ప్రత్యేకమైన వ్యక్తి రాబోతున్నారని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగానే అందరూ ఆయన పెళ్లికి సంబంధించిన వార్తే అని భావించారు. అయితే వారందరినీ ప్రభాస్ నిరుత్సాహపరిచాడు. ఆ ప్రత్యేకమైన వ్యక్తి ఎవరో కాదంటూ తన తాజా సినిమాలో రోబో పాత్రని పరిచయం చేశాడు.

First Published:  19 May 2024 9:01 AM IST
Next Story