Telugu Global
NEWS

3 నెల‌లు.. 30 ముహూర్తాలు.. ఈనెల‌ 11 నుంచి పెళ్లి సంద‌డి

సాధార‌ణంగా మే నెల‌లో కూడా పెళ్లి ముహూర్తాలు బాగా ఉంటాయి. అయితే ఈ ఏడాది ఏప్రిల్ 26తోనే ముహూర్తాల‌న్నీ అయిపోతున్నాయి. త‌ర్వాత మూఢం వ‌స్తుంది.

3 నెల‌లు.. 30 ముహూర్తాలు.. ఈనెల‌ 11 నుంచి పెళ్లి సంద‌డి
X

మాఘ‌మాసం వ‌చ్చేస్తోంది. ఈ నెల 11వ తేదీన మాఘ‌మాసం ప్రారంభం కానుంది. దీంతో పెళ్లి సంద‌డి కూడా షురూ కానుంది. అప్ప‌టి నుంచి మార్చి, ఏప్రిల్ నెలాఖ‌రు వ‌ర‌కు దాదాపు మూడు నెల‌ల‌పాటు శుభ‌ముహూర్తాలు ఉన్నాయి.

ఏప్రిల్ 26 వ‌రకే ముహూర్తాలు

మాఘం, ఫాల్గుణం, చైత్రం ఈ మూడు మాసాలు (ఫిబ్ర‌వ‌రి, మార్చి, ఏప్రిల్ నెల‌ల్లో) దాదాపు 30 ముహూర్తాలు ఉన్నాయ‌ని పంచాంగ‌క‌ర్త‌లు చెబుతున్నారు. ఫిబ్ర‌వ‌రి 11న తొలి ముహూర్తం మొద‌లు ఏప్రిల్ 26 వ‌ర‌కు ముహూర్తాలు ఉన్నాయ‌ని ప్ర‌క‌టించారు.

ఆగ‌స్టు వ‌ర‌కు లేవు

సాధార‌ణంగా మే నెల‌లో కూడా పెళ్లి ముహూర్తాలు బాగా ఉంటాయి. అయితే ఈ ఏడాది ఏప్రిల్ 26తోనే ముహూర్తాల‌న్నీ అయిపోతున్నాయి. త‌ర్వాత మూఢం వ‌స్తుంది. మ‌ళ్లీ శ్రావ‌ణ మాసం (ఆగ‌స్టు) వ‌ర‌కు ముహూర్తాలు లేవు. శ్రావ‌ణ మాసం అంటే అప్ప‌టికి వానాకాలం వ‌చ్చేస్తుంది. కాబ‌ట్టి పెళ్లిళ్లు, శుభ‌కార్యాల‌కు అంత అనువుగా ఉండ‌దు. దీంతో పెళ్లి వ‌య‌సు పిల్ల‌లున్న ఇళ్ల‌లో రాబోయే మూడు నెల‌ల్లోనే సంబంధాలు చూసి ముడిపెట్టేయాల‌న్న హ‌డావుడి మొద‌లైంది.

First Published:  5 Feb 2024 5:21 PM IST
Next Story