అసోంలో రైలు ప్రమాదం జరిగింది. గురువారం సాయంత్రం లోకమాన్య తిలక్ ఎక్స్ ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. అగర్తలా నుంచి ముంబయికి వెళ్తోన్న ఈ రైలు దిమా హసావో జిల్లాలోని దిబలోంగ్ స్టేషన్ సమీపంలో పట్టాలు తప్పిందని అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో ప్రాణాపాయం కలుగలేదని వివరించారు. ఇంజిన్, పవర్ కార్ తో పాటు ఎనిమిది కోచ్ లు పట్టాలు తప్పాయని వెల్లడించారు. రైలు పట్టాలు తప్పడంతో లుమ్డింగ్ – బాదర్పూర్ మధ్య రైళ్ల రాకపోకలు నిలిపివేశారు. రైలు ప్రమాద వివరాలు, ప్రయాణికుల క్షేమ సమాచారం కోసం హెల్ప్ లైన్ నంబర్లు 03674 263120, 03674 263126 సంప్రదించాలని అధికారులు సూచించారు.
Previous Articleతొలి టెస్టులో రెండో రోజు ముగిసిన ఆట.. కివీస్ ఆధిక్యం ఎంతంటే?
Next Article మిస్ ఇండియా కిరీటాన్ని గెలుచుకున్న నికితా పోర్వాల్
Keep Reading
Add A Comment