Telugu Global
NEWS

కిడ్నీ క్యాన్సర్‌ను ఇలా గుర్తిద్దాం..

అసలు ఏ వ్యాధినాయినా ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స చేస్తే, ఆ వ్యాధిని జయించడానికి అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో కిడ్నీ క్యాన్సర్‌ను ముందస్తుగానే గుర్తించే ప్రాథమిక లక్షణాలు, సంకేతాలు ఎంటో తెలుసుకుందాం..

కిడ్నీ క్యాన్సర్‌ను ఇలా గుర్తిద్దాం..
X

క్యాన్సర్.. ప్రస్తుతకాలంలో ప్రాణాలు తీసేస్తున్న ప్రమాదకరమైన వ్యాధి. శరీరంలో వివిధ భాగాల్లో కణాలు ఒక నియంత్రణ లేకుండా పెరగడమే క్యాన్సర్. అదే సమస్య మూత్రపిండాల్లో వస్తే దాన్ని కిడ్నీ క్యాన్సర్‌గా చెప్పవచ్చు. అసలు ఈ వ్యాధి ఏంటో తెలియక, ముందు జాగ్రత్త లేక, సమస్యను ఎర్లీ స్టేజిలో గుర్తించలేక.. ఏటా ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అసలు ఏ వ్యాధినాయినా ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స చేస్తే, ఆ వ్యాధిని జయించడానికి అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో కిడ్నీ క్యాన్సర్‌ను ముందస్తుగానే గుర్తించే ప్రాథమిక లక్షణాలు, సంకేతాలు ఎంటో తెలుసుకుందాం..

కిడ్నీ క్యాన్సర్‌ లక్షణాలు :

కిడ్నీ క్యాన్సర్​కు సంబంధించిన ముందస్తు లక్షణాలను తెలుసుకొనే విషయంలో మన శరీరాన్ని మనం చాలా స్పష్టంగా పరిశీలించాలి. పొత్తికడుపు పైభాగంలో నొప్పి, ఒక వైపు మాత్రమే వచ్చే లో బ్యాక్ పెయిన్, మూత్రంలో రక్తం , విపరీతంగా బరువును కోల్పోవటం, అధిక రక్తపోటు, ఎముక నొప్పి, జ్వరం, ఆకలి లేకపోవడం, ఇవన్నీ కిడ్నీ క్యాన్సర్ సాధారణ లక్షణాలు. కానీ చాలా మందిలో ఈ లక్షణాలు మొదట్లో కనిపించకపోవచ్చు. కాబట్టి, కనీసం ఏడాదికి ఒకసారి హెల్త్ చెకప్‌ చేయించుకోవాలి. అలాగే కుటుంబ సభ్యులకు గతంలో ఎవరికైనా కిడ్నీ సంబంధ సమస్యలు ఉంటే, మరింత జాగ్రత్త పడాల్సి ఉంటుంది.

జాగ్రత్తపడదాం ఇలా..

ఊబకాయం అనేది కిడ్నీ క్యాన్సర్ కు ప్రధాన కారణం. సమతుల ఆహారం, శారీరక శ్రమ ద్వారా బరువును అదుపులో ఉంచుకుంటే కిడ్నీ క్యాన్సర్‌ దరి చేరదు. అలాగే కిడ్నీలు సేఫ్ గా ఉండాలంటే సరిపడ నీళ్లు తాగాలి. తగినన్ని నీళ్లు తాగడం వల్ల కిడ్నీల్లో పేరుకుపోయిన వ్యర్థాలు బయటకు వెళ్లిపోతాయి. కిడ్నీల పనితీరు మెరుగవుతుంది. ధూమపానం, అధిక రక్తపోటు, విపరీతంగా పెయిన్‌ కిల్లర్స్‌ వాడటం కిడ్నీ సమస్యలకు ముఖ్య కారణంగా చెప్పవచ్చు. మంచి సమతుల ఆహారం తీసుకోవడం వల్ల కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. పండ్లు, కూరగాయలు, ప్రొటీన్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో పాటు క్యాన్సర్ ముప్పును దూరం పెట్టచ్చు. రెడ్ మీట్, ప్రాసెస్ చేసిన ఫుడ్స్ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి. వాటిని తీసుకోకపోవడం మంచిది.

First Published:  17 Jun 2024 12:51 PM GMT
Next Story