Telugu Global
NEWS

యూజర్ నేమ్, చాట్ లాక్స్.. వాట్సాప్‌లో కొత్త ఫీచర్లు!

లాక్ చేసిన చాట్‌లు ఓపెన్ చేయాలంటే సెర్చ్ బార్‌‌లో ఆ సీక్రెట్ కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ బీటా యూజర్లకు అందుబాటులో ఉంది. త్వరలోనే అందరికీ అందుబాటులోకి వస్తుంది.

యూజర్ నేమ్, చాట్ లాక్స్.. వాట్సాప్‌లో కొత్త ఫీచర్లు!
X

రీసెంట్‌గా మెటా అనౌన్స్ చేసిన కొన్ని వాట్సాప్ ఫీచర్లు ఇప్పుడు బీటా వెర్షన్స్‌కు అందుబాటులోకి వచ్చాయి. యూజర్ నేమ్‌ సెర్చ్ ఫీచర్‌తో పాటు, చాట్స్ లాక్ వంటి లేటెస్ట్ ఫీచర్లు త్వరలోనే వాట్సాప్‌లో కనిపించనున్నాయి. మరిన్ని వివరాల్లోకి వెళ్తే..

యూజర్ల మొబైల్ నెంబర్‌‌తో పని లేకుండా యూజర్ నేమ్స్‌తో చాట్ చేసుకునే కొత్త ఫీచర్ త్వరలో వాట్సాప్‌లో రానుంది. ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే.. యూజర్లు ఇతరులకు ఫోన్ నెంబర్‌‌కు బదులుగా యూజర్ నేమ్ ఇస్తే సరిపోతుంది. ఇతర సోషల్ మీడియాల తరహాలో ఇకపై వాట్సాప్‌లో కూడా సెర్చ్ బార్ ద్వారా యూజర్ నేమ్స్‌ను సెర్చ్ చేసుకోవచ్చు. ఫోన్‌ నెంబర్‌ను పంచుకోవడం ఇష్టం లేని వ్యక్తులకు ఈ ఫీచర్ ఉపయోగకరంగా ఉంటుంది.

ఇక దీంతోపాటు యూజర్లు సెలక్టెడ్ చాట్స్‌కు పర్సనల్ లాక్‌ వేసుకునే ఫీచర్ కూడా త్వరలో ఎంట్రీ ఇవ్వనుంది. ఈ ఫీచర్‌ ద్వారా చాట్స్‌ను లాక్‌ చేసుకోవడమే కాక వాటికి ప్రత్యేకమైన సీక్రెట్‌ కోడ్‌ కూడా పెట్టుకోవచ్చు. సెర్చ్ బార్‌‌లో ఆయా సీక్రెట్‌ కోడ్‌ ఎంటర్‌ చేస్తేనే చాట్ ఓపెన్ అవుతుంది. ఇతరులెవరూ ఆ చాట్స్‌ను చూసే వీలుండదు.

ఈ ఫీచర్ కోసం ముందుగా వాట్సాప్‌ యాప్‌ను అప్‌డేట్‌ చేసుకోవాలి. ముందుగా లాక్ చేసుకున్న చాట్‌లోకి వెళ్లి అందులో పైన మూడు చుక్కలపై క్లిక్‌ చేయాలి. అక్కడ ‘హైడ్‌ లాక్డ్‌ చాట్స్‌’ ఫీచర్‌ను యాక్టివేట్ చేసి, సీక్రెట్ కోడ్‌ ఎంటర్‌ చేయాలి. లాక్ చేసిన చాట్‌లు ఓపెన్ చేయాలంటే సెర్చ్ బార్‌‌లో ఆ సీక్రెట్ కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ బీటా యూజర్లకు అందుబాటులో ఉంది. త్వరలోనే అందరికీ అందుబాటులోకి వస్తుంది.

First Published:  4 Dec 2023 5:21 PM GMT
Next Story