Kawasaki Ninja 7 HEV | ప్రపంచంలోకెల్లా ఫస్ట్ హైబ్రీడ్ బైక్ `నింజా 7 హెచ్ఈవీ`.. జనవరిలో యూరప్ మార్కెట్‌లో ఆవిష్కరణ
వచ్చే ఏడాది జనవరిలో యూరోపియన్ మార్కెట్లలో లభిస్తుంది ఈ బైక్. భారత్ మార్కెట్‌లో ఎప్పుడు ఆవిష్కరిస్తారన్న సంగతి వెల్లడించలేదు.
Kawasaki Ninja 7 HEV | ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ `కవాసాకీ (Kawasaki)`.. ప్రపంచంలోకెల్లా శక్తిమంతమైన తొలి హైబ్రీడ్ మోటారు సైకిల్ (hybrid production motorcycle) `నింజా 7 హెచ్ఈవీ(Ninja 7 HEV) ఆవిష్కరించింది. హెచ్ఈవీ అంటే హైబ్రీడ్ ఎలక్ట్రిక్ వెహికల్. ఈ మోటారు సైకిల్ 48 వోల్టుల బ్యాటరీ ప్యాక్ ప్లస్ 9 కిలోవాట్ల (12 పీఎస్) ట్రాక్షన్ మోటార్‌తోపాటు 451సీసీ కెపాసిటీ గల ప్యారలల్-ట్విన్ కంబుస్టన్ ఇంజిన్ కలిగి ఉంటుంది. నింజా 7 హెచ్ఈవీ సంప్రదాయ క్లచ్ గేర్ స్థానంలో హోండా డీసీటీ-గేర్ బాక్స్ స్ఫురణకు వచ్చేలా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ స్విచ్ క్లస్టర్‌పై షిఫ్ట్ పెడల్స్ ఏర్పాటు చేశారు. వచ్చే ఏడాది జనవరిలో యూరోపియన్ మార్కెట్లలో లభిస్తుందీ బైక్. భారత్ మార్కెట్‌లో ఎప్పుడు ఆవిష్కరిస్తారన్న సంగతి వెల్లడించలేదు.
ఈ మోటారు సైకిల్‌పై ప్రయాణించేవారు ఆటోమేటిక్ లాంచ్ పొజిషన్ ఫైండర్ సాయంతో రోడ్డుపై వెళుతున్నప్పుడు ఏ గేర్‌పై వెళుతున్నారన్న దాంతో సంబంధం లేకుండా సింపుల్‌గా బటన్ ప్రెస్ చేసి సునాయసంగా ఫస్ట్ గేర్‌లోకి మారిపోయే వెసులుబాటు ఉంటుంది.
కవాసాకీ `7 హెచ్ఈవీ నింజా` మోటారు సైకిల్‌లో పర్యావరణ హిత ఫీచర్ ఉంటుంది. కర్బన ఉద్గారాలను తగ్గించాలని అనుకున్నప్పుడు ఆటోమేటిక్‌గా ఇంజిన్ షట్‌డౌన్ ఆప్షన్ చేసి ట్రోటిల్ గ్రిప్ ట్విస్టింగ్ తో ఆటోమేటిక్ రీస్టార్ట్ బటన్ ప్రెస్ చేయాలి.
కవాసాకీ `నింజా 7 హెచ్ఈవీ` మూడు రైడింగ్ మోడ్‌ల్లో లభిస్తుంది: స్పోర్ట్ హైబ్రీడ్, ఎకో హైబ్రీడ్, ఈవీ.
నింజా, జడ్ ఈ-1 మోడల్ బైక్‌ల మాదిరిగా కవాసాకీ `నింజా 7 హెచ్ఈవీ`మోటార్ సైకిల్ బ్లూటూత్ ఎనేబుల్డ్ టీఎఫ్టీ డాష్‌బోర్డ్ ఫీచర్‌తో వస్తుంది. దీనివల్ల నోటిఫికేషన్, నేవిగేషన్ అలర్ట్స్‌తో అప్రమత్తం కావచ్చు.
`నింజా 7 హెచ్ఈవీ` బైక్ 650-700 సీసీ కెపాసిటీతో నింజా 7 మోటారు సైకిల్‌ను పోలి ఉంటుంది. 250సీసీ మోటార్‌సైకిల్‌తో సమానంగా ఫ్యుయల్ ఎఫిషియెన్సీ కలిగి ఉంటుంది.
న్యూ కవాసాకీ ఈ-1, జడ్ ఈ-1 మోడల్ బైక్‌ల మాదిరిగా ఫుల్ కలర్ టీఎఫ్టీ డిస్‌ప్లే.
స్టాండింగ్ నుంచి ఎప్పుడైనా బయలుదేరేందుకు సిద్ధంగా ఆటోమేటిక్ లాంచ్ పొజిషన్ ఫైండర్.
ఇంధన పొదుపు కోసం కంబుస్టన్ ఇంజిన్ హాల్ట్ చేయడానికి ఐడిల్ స్టాప్ ఫంక్షన్.
క్లచ్ లీవర్ వాడకానికి బదులు హ్యాండిల్ బార్ మౌంటెడ్ పుష్ బటన్ షిప్టింగ్.
నింజా ఈ-1, జడ్ ఈ-1 మోడల్ బైక్స్‌లో మాదిరిగా వాక్ మోడ్, లో స్పీడ్ రివర్స్, ఫార్వర్డ్ ఆప్షన్లు కలిగి ఉంటుందీ బైక్.
♦