Telugu Global
NEWS

ఓటీటీల గురించి అప్పట్లోనే చెప్పా.. నన్నంతా వ్యతిరేకించారు.. కమల్ హాసన్ కామెంట్స్

అయితే సినిమాను థియేటర్లో విడుదల చేయకముందే టీవీల్లో నేరుగా విడుదల చేస్తే థియేటర్, టీవీ బిజినెస్ దెబ్బతింటుందని థియేటర్ల ఓనర్లు, సినీ ప్రముఖులు నా ఐడియాని తప్పుపట్టారు.

ఓటీటీల గురించి అప్పట్లోనే చెప్పా.. నన్నంతా వ్యతిరేకించారు.. కమల్ హాసన్ కామెంట్స్
X

హిట్, ప్లాప్‌లతో సంబంధం లేకుండా ప్రయోగాలు చేయడంలో ముందుంటాడు ప్రముఖ నటుడు కమల్ హాసన్. తన వైవిధ్యమైన నటనతో అందరినీ ఆకట్టుకుంటూ లోక నాయకుడిగా పేరు తెచ్చుకున్నాడు. కాగా, తాజాగా కమల్ హాసన్ ఓటీటీలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నేను పదేళ్ల కిందటే ఓటీటీల గురించి చెబితే.. నన్ను అందరూ వ్యతిరేకించారని.. నా ఐడియాని తప్పుపట్టారని వ్యాఖ్యానించారు. ఇప్పుడంతా ఓటీటీల బాట పడుతున్నారన్నారు.

కరోనా సమయంలో ఎన్నో సినిమాలు షూటింగ్ పూర్తి చేసుకున్నప్పటికీ విడుదలకు మాత్రం నోచుకోలేదు. అప్పుడప్పుడే పుట్టుకు వచ్చిన ఓటీటీ వేదికల్లో ఈ సినిమాలను డైరెక్ట్ గా విడుదల చేస్తే ప్రేక్షకులు ఆదరించారు. కరోనా తగ్గిపోయి పరిస్థితి నార్మల్ అయినప్పటికీ ఓటీటీలకు ఆదరణ తగ్గలేదు. కొన్ని సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఓటీటీల కోసమే తయారవుతున్నాయి. నిర్మాతలకు కూడా ఓటీటీలు ఆదాయ వనరుగా మారాయి. థియేటర్ ఆదాయంతోపాటు ఓటీటీ నుంచి కూడా నిర్మాతలు ఆదాయం పొందుతున్నారు.

ఇదిలా ఉంటే.. ఓటీటీల గురించి ప్రముఖ నటుడు కమల్ హాసన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా దుబాయ్‌లో జరిగిన ఐఫా అవార్డు వేడుకల్లో లైఫ్ టైం ఎచీవ్‌మెంట్ అవార్డు అందుకున్న ఆయన ఓటీటీల గురించి మాట్లాడారు. 'నేను పదేళ్ల కిందట విశ్వరూపం అనే భారీ చిత్రంలో నటించా. ఆ సినిమాను థియేటర్లలో విడుదల చేయకుండా నేరుగా టీవీల్లో విడుదల చేసేందుకు ప్రయత్నించా. డీటీహెచ్ తరహాలో డబ్బు చెల్లించి ఇంట్లో కూర్చుని చూసేలా ఏర్పాట్లు చేశాను.

అయితే సినిమాను థియేటర్లో విడుదల చేయకముందే టీవీల్లో నేరుగా విడుదల చేస్తే థియేటర్, టీవీ బిజినెస్ దెబ్బతింటుందని థియేటర్ల ఓనర్లు, సినీ ప్రముఖులు నా ఐడియాని తప్పుపట్టారు. నన్నంతా వ్యతిరేకించారు. దీంతో నా ప్రయత్నాన్ని విరమించుకున్నా. ఓటీటీల బిజినెస్ గురించి అప్పట్లోనే చెబితే నా మాట ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పుడు మాత్రం అందరూ ఓటీటీల గురించే మాట్లాడుతున్నారు. నన్ను వ్యతిరేకించిన వారందరికీ ఇప్పుడు అర్థమైంది. ఓటీటీల రాకతో అన్ని భాషల్లోని సినిమాలు చూసే అవకాశం ప్రేక్షకులకు దక్కుతోంది' అని కమల్ హాసన్ కామెంట్స్ చేశాడు.

First Published:  29 May 2023 5:39 PM IST
Next Story