తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ ఎన్నికల్లో మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ఘన విజయం సాధించారు. అధ్యక్ష పదవికి పోటీ పడ్డ జితేందర్ రెడ్డికి 43 ఓట్లు, ఆయన సమీప ప్రత్యర్థి చాముండేశ్వర్ నాథ్‌కు 9 ఓట్లు పోలయ్యాయి. 34 ఓట్ల తేడాతో జితేందర్ రెడ్డి విజయం సాధించారు. కార్యదర్శి పదవికి పోటీ పడిన మల్లారెడ్డికి 40 ఓట్లు, బాబురావుకు 12 ఓట్లు వచ్చాయి. 28 ఓట్ల తేడాతో మల్లారెడ్డి గెలుపొందారు. ఒలింపిక్ అసోసియేషన్ ఎన్నికలు జరిగినా బాక్సింగ్ అసోసియేషన్ దాఖలు చేసిన పిటిషన్‌తో సిటీ సివిల్ స్టే ఇచ్చింది. దీంతో ఇన్ని రోజులు ఓట్లు లెక్కించలేదు. కోర్టు స్టే ఎత్తేయడంతో బుధవారం ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటించారు.
Previous Articleనందిని సిధారెడ్డి చూపిన నిబద్ధతకు అభినందనలు : కేటీఆర్
Next Article వరంగల్ ఎయిర్‌పోర్ట్ భూసేకరణ వేగంగా పూర్తి చేయాలి
Keep Reading
Add A Comment