Telugu Global
International

యూట్యూబ్ కింగ్ జిమ్మీ డొనాల్డ్స్

మిస్టర్ బీస్ట్ అనేది ఇతని యూట్యూబ్ ఛానల్ పేరు. 2012 ఫిబ్రవరి 20న ఈ ఛానల్ స్టార్ట్ చేశాడు. ఇప్పటి వరకు అప్ లోడ్ చేసిన వీడియోలు కేవలం 730 మాత్రమే.

యూట్యూబ్ కింగ్ జిమ్మీ డొనాల్డ్స్
X

యూట్యూబ్ లో ఎవరు గ్రేట్ అని చెప్పడానికి సబ్ స్క్రైబర్లే కొలమానం. ఎంతమంది సబ్ స్క్రైబర్స్ ఉంటే, ఎన్ని ఎక్కువగంటలు వీడియోలను వారు చూస్తే.. అంత ఆదాయం వస్తుంది. ఆదాయం సంగతి పక్కనపెడితే వారికి ఊహించని పాపులార్టీ వస్తుంది. అయితే ప్రపంచంలోనే అత్యథిక మంది సబ్ స్క్రైబర్స్ ని కలిగి ఉన్న యూట్యూబర్ ఎవరు..? కొన్ని సంస్థలు, మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్ కి ఎక్కువమంది సబ్ స్క్రైబర్స్ ఉంటారు, వాటి వెనక ఎక్కువమంది కష్టం కూడా ఉంటుంది. వాటిని పక్కనపెడితే, వ్యక్తిగత అకౌంట్లలో అమెరికాకు చెందిన జిమ్మీ డొనాల్డ్స్ ప్రపంచంలోనే అత్యథిక సబ్ స్క్రైబర్స్ ని కలిగిన యూట్యూబర్ గా రికార్డ్ సృష్టించాడు. ఇప్పటి వరకూ ఈ రికార్డ్ స్వీడన్ కి చెందిన ఫెలిక్స్ జెల్బర్గ్ పేరిట ఉండేది. ఇప్పుడిది జిమ్మీ డొనాల్డ్స్ వశమైంది.

ఫెలిక్స్ జెల్బర్గ్ సబ్ స్క్రైబర్స్ సంఖ్య 111.8 మిలియన్లు కాగా, జిమ్మీ తాజాగా 111.9 మిలియన్ల సబ్ స్క్రైబర్స్ ని సాధించి మొదటి స్థానానికి ఎగబాకాడు. మిస్టర్ బీస్ట్ అనేది ఇతని యూట్యూబ్ ఛానల్ పేరు. 2012 ఫిబ్రవరి 20న ఈ ఛానల్ స్టార్ట్ చేశాడు. ఇప్పటి వరకు అప్ లోడ్ చేసిన వీడియోలు కేవలం 730 మాత్రమే. అయినా కూడా మిస్టర్ బీస్ట్ అదరగొట్టాడు. ప్రపంచంలోనే అత్యథిక సబ్ స్క్రైబర్స్ ని సాధించిన యూట్యూబర్ గా రికార్డ్ సృష్టించారు. 2021లో యూట్యూబ్ నుంచి అత్యథిక ఆదాయం సంపాదించిన వ్యక్తి కూడా ఇతనే కావడం గమనార్హం.

ఎలాంటి వీడియోలు అప్ లోడ్ చేస్తాడు..?

నెట్‌ ఫ్లిక్స్ లో విడుద‌లైన స్క్విడ్ గేమ్స్ సిరీస్‌ ని రీక్రియేట్ చేయ‌డంతో జిమ్మీ పాపులారిటీ పెరిగిపోయింది. అంతే కాదు.. ఇతను నేరుగా చాలామందికి నగదు సహాయం కూడా చేస్తుంటాడు, పేదలకు టీవీలు, ఫ్రిడ్జ్ లు, బైక్ లు, కొంతమందికి కార్లు కూడా ఇస్తుంటాడు. అరుణాచలం సినిమాలో లాగా 100 రోజుల్లో 100కోట్లు ఖర్చుపెట్టడం ఎలా అనే కాన్సెప్ట్ లు కూడా ఇతని దగ్గర చాలా ఉన్నాయి. అందుకే ఇతని సబ్ స్క్రైబర్స్ కోట్లలో ఉన్నారు.

రెస్టారెంట్ కూడా..

యూట్యూబ్ లో వచ్చిన పాపులార్టీతో ఇతను మిస్టర్ బీస్ట్ అనే రెస్టారెంట్ ని అమెరికాలో ప్రారంభించాడు. ఈ రెస్టారెంట్ కూడా బాగా పాపులర్ అయింది. దీనికి ఫ్రాంచైజీలను ఇస్తున్నాడు. యూట్యూబ్ లో బీస్ట్ చేసే వీడియోలకు సంబంధించిన థీమ్స్ ఈ రెస్టారెంట్ లో ఉంటాయి. ఇంత ఘనత సాధించిన మిస్టర్ బీస్ట్ వయసు ఎంతనుకుంటున్నారు. కేవలం 24 ఏళ్లు మాత్రమే. పాతికేళ్లు లేని కుర్రాడు ఇప్పుడు యూట్యూబ్ కింగ్ లా మారాడు.

First Published:  16 Nov 2022 9:51 AM IST
Next Story