Telugu Global
International

కోవిడ్‌-19 చైనా ఉద్దేశ‌పూర్వ‌కంగా త‌యారుచేసిన జీవాయుధ‌మే..

ఇంటర్నేషనల్ ప్రెస్ అసోసియేషన్ సభ్యురాలు జెన్నిఫర్ ఝెంగ్‌కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చావోషావ్ ఈ విషయాలను వెల్లడించారు. కోవిడ్‌-19 వైర‌స్‌ను జీవాయుధంలా వాడుకొనేలా చైనా మార్పులు చేసిందని తెలిపారు.

కోవిడ్‌-19 చైనా ఉద్దేశ‌పూర్వ‌కంగా త‌యారుచేసిన జీవాయుధ‌మే..
X

కోవిడ్ వైర‌స్ గురించి త‌లుచుకుంటేనే ప్ర‌పంచ‌వ్యాప్తంగా అది సృష్టించిన మార‌ణ‌హోమం గుర్తుకొచ్చి భ‌య‌కంపితుల‌ను చేస్తుంది. మ‌రి అది అనుకోకుండా పుట్టుకొచ్చిన వైర‌స్ కాద‌ని.. ఉద్దేశ‌పూర్వ‌కంగా త‌యారుచేసిన జీవాయుధ‌మ‌ని తెలిస్తే.. అది ప్ర‌పంచాన్ని తీవ్ర ఆందోళ‌న‌కు గురిచేసే విష‌య‌మే అవుతుంది. తాజాగా వుహాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ల్యాబ్ పరిశోధకుడు చావోషావ్ ఓ ఇంట‌ర్వ్యూలో ఇదే విష‌యాన్ని వెల్ల‌డించారు. అది జీవాయుధ‌మేన‌ని.. చైనా ఉద్దేశ‌పూర్వ‌కంగా త‌యారుచేసిన‌దేన‌ని ఆయ‌న తెలిపారు.

ఇంటర్నేషనల్ ప్రెస్ అసోసియేషన్ సభ్యురాలు జెన్నిఫర్ ఝెంగ్‌కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చావోషావ్ ఈ విషయాలను వెల్లడించారు. కోవిడ్‌-19 వైర‌స్‌ను జీవాయుధంలా వాడుకొనేలా చైనా మార్పులు చేసిందని తెలిపారు. ఈ ల్యాబ్‌లోని ఉన్న‌తాధికారి ఒక‌రు మొత్తం నాలుగు ర‌కాల వైర‌స్‌ల‌ను త‌మ స‌హ‌చ‌రుల‌కు ఇచ్చి.. ఏది వేగంగా ఎక్కువ జాతుల‌కు వ్యాపిస్తుందో గుర్తించ‌మ‌ని ఆదేశించార‌ని ఆయ‌న వివ‌రించారు. దీంతోపాటు సులువుగా దీనిని వేరే వ్యక్తులు, జాతులకు సోకేలా చేసేందుకు ఉన్న మార్గాలను కనుగొనమని ఆదేశించినట్టు వెల్ల‌డించారు.

క‌రోనా వైర‌స్‌ను చావోషావ్ ఓ జీవాయుధంతో పోల్చారు. 2019లో వుహాన్‌లో ప్ర‌పంచ‌స్థాయి సైనిక క్రీడ‌లు జ‌రిగిన స‌మ‌యంలో త‌మ స‌హ‌చ‌రులు అనేక‌మంది అదృశ్య‌మ‌య్యార‌ని ఆయ‌న వివ‌రించారు. వారందరినీ సైనిక క్రీడాకారులు బస చేసిన హోటళ్లలో పరిశుభ్రతను పరిశీలించేందుకు పంపినట్లు తెలిసిందని చెప్పారు. వాస్తవానికి పరిశుభ్రతను గుర్తించేందుకు వైరాలజిస్టుల అవసరం లేదని తెలిపారు. ఆ క్రీడాకారులున్న చోట వైరస్‌ను వ్యాప్తి చేసేందుకే వారిని పంపినట్లు తెలిసిందన్నారు.

గతంలో తనను కూడా షింజియాంగ్లో ప్రభుత్వ ఖైదీలుగా ఉన్న వీగర్ల ఆరోగ్య పరిస్థితి తెలుసుకొనేందుకు పంపారని 2020లో చావో ఆరోపించారు. ఈ మొత్తం కుట్రలో తాను చెప్పేది చాలా చిన్న విషయమని పేర్కొన్నారు. ఇప్పటి వరకు కరోనా వైరస్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా 70 లక్షల మంది ప్రాణాలు కోల్పోయిన విష‌యం తెలిసిందే. తాజాగా చావోషావ్ వెల్ల‌డించిన విష‌యాల‌తో ఈ అంశం ఇప్పుడు మ‌రింత చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

First Published:  28 Jun 2023 4:43 PM IST
Next Story